IPL మ్యాచ్-4 : రాజస్థాన్ పై SRH గ్రాండ్ విక్టరీ

DHAVANIPL -11వ సీజన్‌ లో భాగంగా సోమవారం (ఏప్రిల్-9) ఉప్పల్ స్టేడియంలో  రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్‌ లో సన్‌ రైజర్స్ ఘన విజయం సాధించింది హైదరాబాద్. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేసిన రాయల్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. 126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ వికెట్ నష్టంతో 15.5 ఓవర్లలో 127 పరుగులు చేసి, లక్ష్యాన్ని చేధించింది. శిఖర్ ధవన్ 54 బంతుల్లో 73 పరుగులు, విలియమ్సన్ 35 బంతులు 36 పరుగులతో జట్టును విజయపథంలో నడిపించారు. అంతకుముందు వ్యక్తిగత స్కోరు సున్నా వద్ద తాను ఇచ్చిన సునాయాస క్యాచ్‌ ను రహానే వదిలేయడంతో బతికిపోయిన ధావన్‌ ఆ తర్వాత బ్యాట్‌ ఝళిపించాడు. హాఫ్ సెంచరీతో (54 నాటౌట్) విరుచుకుపడ్డాడు. రాజస్థాన్ పై 9 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. రాజస్థాన్ ప్లేయర్లలో సంజు శామ్సన్‌ (42 బంతుల్లో 49; 5 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. హైదరాబాద్ బౌలర్లలో కౌల్, షకీబ్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు.

నేటి మ్యాచ్ : చెన్నై సూపర్ కింగ్స్-కోల్ కతా నైట్ రైడర్స్ తో చెన్నైలో జరగనుంది.

Posted in Uncategorized

Latest Updates