IPL మ్యాచ్ -4 : సన్ రైజర్స్ టార్గెట్ -126

hydరాజ‌స్థాన్ రాయ‌ల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న IPL లో టాస్‌ గెలిచి బౌలింగ్ ను ఎంచుకుంది హైదరాబాద్ సన్ రైజర్స్. బ్యాటింగ్ తో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ 125 పరుగులు చేసి…సన్ రైజర్స్ కు 126 పరుగుల టార్గెట్ ను ఇచ్చింది.

రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు సంజు సాంసన్ 49, రాహుల్ 17,గోపాల్ 18 పరులు చేశారు. మిగతా ప్లేయర్లు అంతగా రాణించలేక పోయారు.

సన్ రైజర్స్ బౌలర్లలో షకిబుల్‌ హసన్‌, సిద్ధార్ధ్ కౌల్ చెరో 2 వికెట్లు తీసుకున్నారు. భువనేశ్వర్ కుమార్, బిల్లీ స్టాన్‌ లేక్‌, రషీద్ ఖాన్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates