IPL మ్యాచ్: 5వికెట్ల తేడాతో సన్ రైజర్స్ పై కోల్ కతా విక్టరీ

KKహైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియంలో శనివారం(మే-19) జరిగిన IPL మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఓడించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ 173 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించి నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో రెండు బంతులు మిగిలి ఉండ‌గానే ఐదు వికెట్ల న‌ష్టానికి గాను 173 ప‌రుగులు చేసింది.

కోల్ కతా బ్యాట్స్ మెన్ లు లయిన్ 53, ఉతప్ప 45, నరైన్ 29, కార్తీక్ 26 పరుగులు చేశారు.

సన్ రైజర్స్ బౌలర్లు సిద్ధార్థ్ కౌల్ 2 వికెట్లు పడగొట్టగా.. షకీబుల్ హసన్,బ్రాత్ వైట్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.

తాజా గెలుపుతో  కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 16 పాయింట్లతో ప్లే ఆఫ్‌కు అర్హత సాధించింది.

Posted in Uncategorized

Latest Updates