IPL మ్యాచ్-51 : హైదరాబాద్ పై బెంగళూరు విక్టరీ

IPLప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో కోహ్లీ గ్యాంగ్ సత్తా చాటింది. ఉత్కంఠ పోరులో హైదరాబాద్ పై 14 పరుగుల తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్ లో చెలరేగి ఆడిన RBC…ఆ తర్వాత బౌలింగ్ లో కష్టపడి మ్యాచ్ ను కాపాడుకుంది. దీంతో ఇప్పటి వరకు 13 మ్యాచ్ లు ఆడిన RCB…ఆరు మ్యాచుల్లో విజయం సాధించింది.

టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన RCB….ఆరు వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. AB డివిలియర్స్ మరోసారి తన ప్రతాపాన్ని చూపించాడు. 39 బాల్స్ లో 69 రన్స్ చేశాడు. మరోవైపు మొయిన్ అలీ కూడా చెలరేగి ఆడాడు. 34 బాల్స్ లో 65 పరుగులు చేశాడు. వీరిద్దరు సన్ రైజర్స్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ బౌండరీల మోత మోగించారు.  మిడిల్ ఆర్డర్ లో వచ్చిన గ్రాండ్ హోమ్ కూడా 17 బాల్స్ లో 40 రన్స్ చేశాడు. కోహ్లీ గ్యాంగ్ ఇచ్చిన భారీ టార్గెట్ ను చేజ్ చేసేందుకు…చివరి వరకు పోరాడింది సన్ రైజర్స్. నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 204 రన్స్ మాత్రమే చేసింది. కేన్ విలియమ్సన్-మనీష్ పాండేలు కలిసి ఏకంగా 135 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 42 బాల్స్ లో 7 ఫోర్లు, 5 సిక్సులతో 81 రన్స్ చేశాడు విలియమ్సన్. మరోవైపు మనీష్ పాండే 62 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. చివరి ఓవర్ లో సన్ రైజర్స్ విజయానికి 20 రన్స్ కావాల్సి ఉండగా..ఐదు రన్స్ మాత్రమే వచ్చాయి. దీంతో RCB 14 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Posted in Uncategorized

Latest Updates