IPL మ్యాచ్-6 : ఢిల్లీపై రాజస్థాన్ విక్టరీ

BCCIIPL సీజన్ -11లో భాగంగా బుధవారం (ఏప్రిల్-11) జైపూర్ లో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీపై 10 పరుగుల తేడాతో విజయాన్నందుకుంది రాజస్థాన్. వర్షం కారణంగా 6 ఓవర్లకు 71 పరుగులుగా కుదించిన లక్ష్యాన్ని డేర్‌డెవిల్స్‌ అందుకోలేకపోయింది. ఆ జట్టు 6 ఓవర్లలో 4 వికెట్లకు 60 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాయల్స్‌… 17.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసిన సమయంలో వాన అంతరాయం కలిగించింది. చాలాసేపటి తర్వాత మ్యాచ్‌ మొదలుకాగా… డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం డేర్‌ డెవిల్స్‌ లక్ష్యాన్ని 6 ఓవర్లకు 71గా నిర్దేశించారు. అయితే… విధ్వంసక ఓపెనర్‌ మున్రో (0) తొలి బంతికే రనౌట్‌ కావడం, మ్యాక్స్‌వెల్‌ (12 బంతుల్లో 17; 2 ఫోర్లు, 1 సిక్స్‌), రిషభ్‌ పంత్‌ (14 బంతుల్లో 20; 3 ఫోర్లు) ధాటిగా ఆడలేకపోవడంతో లక్ష్యానికి ఢిల్లీ మరో 11 పరుగుల దూరంలోనే ఆగిపోయింది. అంతకుముందు రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ రహానే (40 బంతుల్లో 45, 5 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌ గా నిలిచాడు. సంజు శామ్సన్‌ (22 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), జాస్‌ బట్లర్‌ (18 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కొద్దిసేపు మెరిపించారు.
నేటి మ్యాచ్.. హైదరాబాద్ తో ముంబై ఢీకొట్టనుంది.

Posted in Uncategorized

Latest Updates