IPL మ్యాచ్-7 : ముంబైపై హైదరాబాద్ గ్రేట్ విక్టరీ

IPLIPL సీజన్-11లో భాగంగా గురువారం (ఏప్రిల్-12)న ముంబైతో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ వికెట్ తేడాతో విజయం సాధించింది.సొంతగడ్డపై సన్‌ రైజర్స్‌ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. లాస్ట్ బాల్ వరకు ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌ లో ముంబై ఇండియన్స్‌ ను ఓడించింది రైజర్స్‌. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌ కు చేసిన ముంబై ఇండియన్స్‌.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఎవిన్‌ లూయీస్‌ (17 బంతుల్లో 29; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), పొలార్డ్‌ (23 బంతుల్లో 28; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (31 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్‌) జట్టు స్కోరులో తలో చేయి వేశారు.

సందీప్, కౌల్, స్టాన్‌ లేక్‌ తలా 2 వికెట్లు పడగొట్టగా… మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ రషీద్‌ ఖాన్‌ 4 ఓవర్లలో 13 పరుగులు మాత్రమే ఇచ్చి, ఒక వికెట్‌ తీయడం విశేషం. అనంతరం రం సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ధావన్‌ (28 బంతుల్లో 45; 8 ఫోర్లు) మరోసారి టాప్‌ స్కోరర్‌ గా నిలవగా… దీపక్‌ హుడా (25 బంతుల్లో 32 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌) కీలక ఇన్నింగ్స్‌ తో జట్టును గెలిపించాడు. మయాంక్‌ మార్కండే 23 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. శనివారం (ఏప్రిల్-14) కోల్‌ కతాలో జరిగే తర్వాతి మ్యాచ్‌ లో నైట్‌ రైడర్స్‌ తో తలపడనుంది సన్‌రైజర్స్‌.

Posted in Uncategorized

Latest Updates