IPL మ్యాచ్-8 : పంజాబ్ పై బెంగళూరు విజయం

RCBIPL సీజన్-11లో భాగంగా శుక్రవారం (ఏప్రిల్-13)న బెంగళూరులో పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది రాయల్ చాలెంజర్స్. దీంతో IPL ఫస్ట్ మ్యాచ్‌ లో కోల్‌ కతా చేతిలో ఓడిన కోహ్లి సేన.. వెంటనే కోలుకుంది. సొంత మైదానంలో కీలక విజయంతో పాయింట్ల బోణీ చేసింది.   టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌ కు దిగిన కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ 19.2 ఓవర్లలో 155 పరుగులకే ఆలౌటైంది.

kL రాహుల్‌ (30 బంతుల్లో 47; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌ గా నిలవగా, రవిచంద్రన్‌ అశ్విన్‌ (21 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్‌) మంచి ఇన్నింగ్స్‌ ఆడాడు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ ఉమేశ్‌ యాదవ్‌ 23 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ చేసిన రాయల్‌ చాలెంజర్స్‌ 19.3 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులు చేసి, విక్టరీ సాధించింది. AB డివిలియర్స్‌ (40 బంతుల్లో 57 నాటౌట్‌; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీ సాధించగా, డికాక్‌ (34 బంతుల్లో 45; 7 ఫోర్లు, 1 సిక్స్‌) ఆకట్టుకున్నాడు. అశ్విన్‌కు 2 వికెట్లు దక్కాయి. 2018 IPLలో వరుసగా ఎనిమిదో మ్యాచ్‌ లోనూ టాస్‌ గెలిచిన జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకోవడం విశేషం.

నేటి మ్యాచ్ లు: ముంబై VS ఢిల్లీ -హైదరాబాద్ VS కోల్ కతా

Posted in Uncategorized

Latest Updates