IPL సందడి మొదలైంది : కొత్త ఆటగాళ్లను పరిచయం చేసిన సన్ రైజర్స్

sunహైదరాబాద్ లో ఐపీఎల్ సందడి మొదలైంది. టీమ్ లోకి వచ్చిన కొత్త ఆటగాళ్లను పరిచయం చేసింది సన్ రైజర్స్ ఫ్రాంచైజీ. టీమ్ మెంటర్ వీవీఎస్ లక్ష్మణ్, హెడ్ కోచ్ టామ్ మూడీ, బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. వృద్ధిమాన్ సాహా, నటరాజన్, శ్రీవాత్సవ్ గోస్వామి, సయ్యద్ ఖలీల్ అహ్మద్, మనీష్ పాండే, యూసఫ్ పఠాన్, సచిన్ బేబీ, సందీప్ శర్మ, సయ్యద్ మెహదీ హసన్, స్టాల్ లేక్, కార్లోస్ బ్రాత్ వైట్ లకు జెర్సీలు అందించారు.  కొత్త ప్లేయర్స్ అయినప్పటికీ… జట్టు బౌలింగ్, బ్యాటింగ్ విభాగంలో పటిష్టంగా ఉందని కోచ్ లు చెప్పారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కేన్ విలియమ్సన్ కెప్టెన్ గా… బౌలర్ భువనేశ్వర్ వైస్ కెప్టెన్ గా ఉన్నారు.

Posted in Uncategorized

Latest Updates