IPL సందడి షురూ

IPL IPL సందడి షురూ అయింది.  శనివారం (ఏప్రిల్-7) నుంచి మ్యాచ్ లు మొదలుకానున్నాయి. 51  రోజులు జరిగే ఈ బిగ్ ఫైట్ లో ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. బాల్ టు బాల్ , రన్ టు రన్ ..క్షణ క్షణం ఉత్కంఠగా సాగే టీ20 లీగ్.. అభిమానులకి కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్ ఇవ్వనుంది. IPL క్రికెట్ లీగ్ మరోసారి సందడి చేయనుంది. ఏప్రిల్ ఏడు నుంచి మే  27 వరకు మ్యాచులు జరుగుతాయి. IPL ప్రారంభ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్..ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనున్నాయి.

51 రోజులు జరిగే ఈ బిగ్ ఫైట్ లో.. సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, డిల్లీ డేర్ డెవిల్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్ కత నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు బరిలో దిగుతున్నాయి.  ఈ సీజన్ లో మొత్తం 60 మ్యాచ్ లు జరగనున్నాయి. ప్రతీ జట్టు 14 మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుంది.  ఐపీఎల్ పదకొండో సీజన్ కి 10 మెట్రో సీటీలోని స్టేడియాలు వేదికలయ్యాయి. ఢిల్లీ, ముంబై, కోల్ కత, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ఇండోర్, జైపూర్,  మొహాలీ, పుణేలో ఐపీఎల్ మ్యాచ్ లు జరగనున్నాయి.

సన్ రైజర్స్ హైదరాబాద్ హోమ్ గ్రౌండ్ ఉప్పల్ స్టేడియంలో మొత్తం ఏడు మ్యాచ్ లు జరగనున్నాయి. ఏప్రిల్ 9న రాజస్థాన్ రాయల్స్ తో, 12న ముంబై ఇండియన్స్ , 22న చెన్నై సూపర్ కింగ్స్, 26న కింగ్స్ ఎలెవన్ పంజాబ్, మే 5న డిల్లీ డేర్ డెవిల్స్, మే 7న రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, మే 19న కోల్ కతా నైట్ రైడర్స్ తో సన్ రైజర్స్ జట్టు తలపడనుంది.

క్రికెట్ లవర్స్ కోసం ఐపీఎల్ టికెట్స్ ని ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచారు. www.eventsnow.com,  www.sunrisers.com వెబ్ సైట్స్ లో టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. జింఖానా గ్రౌండ్, ఎల్బీ స్టేడియంలో ఒరిజినల్ టికెట్స్ ని కలెక్ట్ చేసుకోవాలని చెప్తున్నారు ఆర్గనైజర్స్.

Posted in Uncategorized

Latest Updates