IPL-2018 : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ డేర్ డెవిల్స్

hpIPL లో భాగంగా ముంబై వాంఖడే స్టేడియంలో ఈ రోజు(ఏప్రిల్-14) ముంబై ఇండియన్స్‌- ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది ఢిల్లీ డేర్‌డెవిల్స్‌. ఈ సీజన్‌ లో ఇప్పటివరకూ ఇరు జట్లు ఇంకా బోణీ కొట్టలేదు. చెన్నై సూపర్‌ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చేతిలో ముంబై ఇండియన్స్‌ కు ఓటమి ఎదురుకాగా,  రాజస్తాన్‌ రాయల్స్‌,  కింగ్స్‌ పంజాబ్‌ జట్లపై ఢిల్లీ ఓటమి పాలైంది. ఇరు జట్లు పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో నిలిచాయి.

Posted in Uncategorized

Latest Updates