IPL-2019 వేలం : ఉనద్కత్, వరుణ్ చక్రవర్తిలకు చెరో రూ.8.40 కోట్లు..

జైపూర్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్ కోసం క్రికెటర్ల వేలం పోటాపోటీగా సాగింది. ఏడాది కాలంగా సత్తా చాటిన యంగ్ క్రికెటర్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయారు. యువరాజ్ సింగ్, ఇషాంత్ శర్మ, బ్రెండన్ మెక్ కల్లమ్ సహా మొత్తం 351 మంది వేలంలో ఉన్నారు. వీరిలో 70మందికి మాత్రమే అవకాశం దక్కుతుంది. వేలంలో ఉన్న మొత్తంలో ఒక్కో ఖాళీకి ఐదుగురు పోటీలో ఉన్నారన్నమాట.

తమిళనాడు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అత్యంత ఎక్కువ రేట్ తో అందరికీ షాకిచ్చాడు. అన్ క్యాప్డ్ ప్లేయర్ గా వేలంలో నిలిచిన వరుణ్ చక్రవర్తి రూ.8.4కోట్లు పలికాడు. వరుణ్ ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ దక్కించుకుంది. 

సౌరాష్ట్ర లెఫ్ట్ ఆర్మ్ పేసర్ జయదేవ్ ఉనద్కత్ తొలిరోజు వేలంలో హైలైట్ గా నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్ ఉనద్కత్ ను రూ.8.40 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. గత ఐపీఎల్ సీజన్ లో రాజస్థాన్ ఫ్రాంచైజీ రూ.11.5కోట్లకు దక్కించుకుంది. ఈసారి కూడా భారీ ధరకు ఉనద్కత్ ను సొంతం చేసుకుంది రాజస్థాన్. అక్షర్ పటేల్ ను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు… రూ.5కోట్లకు కొనుక్కుంది.

  • మోహిత్ శర్మ – రూ.5కోట్లు – చెన్నై సూపర్ కింగ్స్
  • మహ్మద్ షమీ – రూ.4.8కోట్లు – కింగ్స్ ఎలెవన్ పంజాబ్
  • నికోలస్ పూరన్ (వెస్టిండీస్) – రూ.4.2కోట్లు – కింగ్స్ ఎలెవన్ పంజాబ్
  • ఎం.హెన్రిక్స్ (ఆస్ట్రేలియా) – రూ.1కోటి – కింగ్స్ ఎలెవన్ పంజాబ్
  • జానీ బెయిర్ స్టో (ఇంగ్లండ్) – రూ.2.2 కోట్లు – సన్ రైజర్స్ హైదరాబాద్

రూ.50లక్షల బేస్ ప్రైజ్ ఉన్న హనుమ విహారిని.. రూ.2కోట్ల కు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. కీపర్ వృద్ధిమాన్ సాహాను రూ.1.2కోట్లకు సన్ రైజర్స్ దక్కించుకుంది. వరుణ్ అరోణ్ ను రాజస్థాన్ రాయల్స్ రూ.2.4కోట్లకు , లసిత్ మలింగాను రూ.2కోట్లకు ముంబై ఇండియన్స్, ఇషాంత్ శర్మను రూ.1.1 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకున్నాయి. గురుకీరత్ సింగ్ ను రూ.50లక్షలతో ఆర్సీబీ కొనుక్కుంది.

విండీస్ ప్లేయర్స్ కు బంపరాఫర్

ఫారిన్ ప్లేయర్ల సెగ్మెంట్ లో… విండీస్ ఆల్ రౌండర్ కర్లోస్ బ్రాత్ వైట్ ను రూ.5కోట్లకు కోల్ కతా నైట్ రైడర్స్ కొనుక్కుంది. విండీస్ నయా బ్యాటింగ్ సంచలనం హెట్ మెయిర్ ను రూ.4.20కోట్లకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది.

యువరాజ్ సింగ్ కు షాక్.. ఆసక్తి చూపని ఫ్రాంచైజీలు

2019 సీజన్ ఐపీఎల్ కోసం యువరాజ్ సింగ్ ను తీసుకోవడానికి తొలిరోజు ఏ జట్టు కూడా ఇంట్రస్ట్ చూపలేదు. ఇప్పటికే తన బేస్ ప్రైజ్ ను యువరాజ్ రూ.2కోట్ల నుంచి రూ.కోటికి తగ్గించుకున్నాడు. ఐపీఎల్ లో అత్యధికంగా గతంలో రూ.16కోట్లు పలికిన యువరాజ్ సింగ్ పై ఈసారి వేలంలో ఫ్రాంచైజీలు దృష్టిపెట్టలేదు. పుజారా, మెక్ కల్లమ్, అలెక్స్ హేల్స్ లు కూడా ఫస్ట్ ఫేజ్ వేలంలో అమ్ముడుపోలేదు.

Posted in Uncategorized

Latest Updates