IPL ఓపెనింగ్ సెర్మనీ రద్దు: రూ.20 కోట్లు భద్రతా బలగాలకు

IPL 2019 సీజన్ మొదటి మ్యాచ్ ప్రారంభం అయింది. అయితే ఈ సీజన్ ప్రారంభ వేడుకలను బీసీసీఐ రద్దు చేసింది. ఈ వేడుకలకు 20 కోట్లు ఖర్చు అవనుండగా.. ఈ మొత్తాన్ని భారత బధ్రతా బలగాలకు ఇవ్వనున్నారు. ఇందులో నుండి రూ.11 కోట్లను భారత ఆర్మీకి..రూ.7 కోట్లను CRPF కు, చెరో కోటి రూపాయలను నేవీ, ఎయిర్ ఫోర్స్ కు ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని ఐపీఎల్ అధికారులు శనివారం ప్రకటించారు.

ప్రజల కోసం, దేశం కోసం ప్రాణత్యాగం చేస్తున్న సైనికులకు తమ వంతుగా సహాయం చేయలన్న నిర్ణయాన్ని బీసీసీఐ తీసుకున్నట్లు సీఓఏ చైర్మన్ వినోద్ రాయ్ చెప్పారు. ఈ నిర్ణయాన్ని దేశం మొత్తం స్వాగతిస్తుందని అన్నారు.  దేశం కోసం సహాయం అందించడంలో బీసీసీఐ ముందుంటుందని సీఓఏ సభ్యురాలె దైనా చెప్పారు.

Latest Updates