బ్యాట్స్‌‌మెన్‌‌ కోసం పోలీసుగా ఉండలేను

న్యూఢిల్లీ: గతేడాది ఐపీఎల్‌‌లో జాస్ బట్లర్‌‌ను స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మన్కడింగ్ ద్వారా ఔట్ చేయడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అశ్విన్ చేసింది కరెక్టేనని, లేదు అతడిది తప్పు అని ఈ విషయంపై భిన్న వాదనలు వినిపించాయి. ఈ నేపథ్యంలో గత సీజన్‌‌లో పంజాబ్‌‌కు ఆడిన అశ్విన్ ఈ సీజన్‌‌లో ఢిల్లీ కేపిటర్స్ తరఫున బరిలోకి దిగాడు. ఆ జట్టు కోచ్ రికీ పాంటింగ్ అశ్విన్‌‌ను మన్కడ్ చేయొద్దని వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. దీంతో ఆర్సీబీతో ఢిల్లీ ఆడిన లాస్ట్ మ్యాచ్‌‌లో ఫించ్‌‌ను మన్కడ్ చేసే చాన్స్ వచ్చినా అశ్విన్ కావాలనే వదిలేశాడు. దీనిపై తాజాగా అశ్విన్ స్పందించాడు.

బాల్ వేయక ముందే బ్యాట్స్‌‌మన్ క్రీజు దాటడంపై అశ్విన్ వ్యంగ్యంగా సమాధానం ఇచ్చాడు. ఇకపై తాను పోలీసుగా వ్యవహరించనన్నాడు. దొంగలు తమంత తాముగా పశ్చాత్తాప పడేంత వరకు దొంగతనాలు ఆపలేరన్నాడు. తప్పు చేసేవాడు తప్పే చేస్తాడని పాంటింగ్ తనకు చెప్పాడని పేర్కొన్నాడు. ‘ఒకటి స్పష్టం చేయాలని భావిస్తున్నా.. 2020కి ఇదే తొలి, చివరి వార్నింగ్. దీన్ని నేను అధికారికంగా చెబుతున్నా, తర్వాత నన్నెవరూ నిందించొద్దు. రికీ పాంటింగ్, రనౌట్, నాన్ స్ట్రయికర్, ఆరోన్ ఫించ్ మేం అందరం మంచి మిత్రులం’ అని అశ్విన్ ట్వీట్ చేశాడు.

Latest Updates