అతడు ఐపీఎల్ లో డబుల్ సెంచరీ కొడతాడు

న్యూఢిల్లీ: ఐపీఎల్ పదమూడో సీజన్ కు టీమ్స్ సన్నద్ధం అవుతున్నాయి. ఆదివారం టోర్నీ షెడ్యూల్ కూడా విడుదలైంది. ఈ నేపథ్యంలో అన్ని టీమ్స్ ప్రాక్టీస్ ను వేగవంతం చేస్తున్నాయి. అలాగే జట్ల తుది కూర్పుపై కసరత్తులు చేస్తున్నాయి. టోర్నీలో వన్ ఆఫ్ ది ఫేవరెట్ టీమ్ అయిన కోల్ కతా నైట్ రైడర్స్ కూడా సన్నాహకాల్లో మునిగింది. డైనమిక్ ఆల్ రౌండర్, హార్డ్ హిట్టర్ అయిన ఆండ్రే రస్సెల్ ను ఈసారి మూడో స్థానంలో ఆడించడానికి కేకేఆర్ ఆలోచిస్తోంది. కేకేఆర్ కు బ్రెండన్ మెకల్లమ్ కోచ్ గా, డేవిడ్ హస్సీ మెంటార్ గా ఉన్నారు. రస్సెల్ ను బ్యాటింగ్ ఆర్డర్ లో పైకి ఆడించాలని వీరిద్దరూ యోచిస్తున్నారు. రస్సెల్ మూడో ప్లేస్ లో ఆడితే తన విధ్వంసకర బ్యాటింగ్ తో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాని డబుల్ హండ్రెడ్ ను కొట్టేస్తాడని హస్సీ జోస్యం చెప్పాడు. ‘ఒకవేళ టీమ్ కు ప్రయోజనం చేకూరుతుందంటే రస్సెల్ బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకొస్తాడు. అతడు మూడో ప్లేస్ లో దిగి 60 బాల్స్ ఎదుర్కొంటే డబుల్ సెంచరీ కొట్టగలడు. రస్సెల్ కు ఏదైనా సాధ్యమే’నని హస్సీ పేర్కొన్నాడు.

Latest Updates