రైనా స్థానంలో అతడే కరెక్ట్

న్యూఢిల్లీ: క్రికెట్ ఫ్యాన్స్ ఐపీఎల్ పదమూడో సీజన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరో 8 రోజుల్లో మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అన్ని టీమ్స్ సన్నాహకాల్లో మునిగిపోయాయి. చెన్నై సూపర్ కింగ్స్ ను తీసుకుంటే సురేష్ రైనా, హర్భజన్ సింగ్ గైర్హాజరీ ఆ టీమ్ పెర్ఫామెన్స్ పై కొంత ప్రభావం చూపే ఉంది. ముఖ్యంగా సీఎస్కే విజయాల్లో కీలకమైన రైనా లేకపోవడం ఆ జట్టుకు ఎదురు దెబ్బగా చెప్పొచ్చు. ఐపీఎల్ లో సెకండ్ హయ్యస్ట్ రన్స్ స్కోరర్ గా రైనా ఉన్నాడు. ఈ తరుణంలో రైనా స్థానంలో రీప్లేస్ మెంట్ గా ఎవరిని తీసుకుంటారో, లేదా ఆ ప్లేస్ లో ఏ ప్లేయర్ కు అవకాశం కల్పిస్తారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. దీనిపై సీఎస్కే మేనేజ్ మెంట్ తరఫున షేన్ వాట్సన్ స్పందించాడు.

‘రైనా, హర్భజన్ లోటును పూడ్చాల్సి ఉంది. రైనా లాంటి ప్లేయర్ ను రీప్లేస్ చేయడం చాలా కష్టం. యూఏఈలోని ఉక్కపోత పరిస్థితుల మధ్య టర్నింగ్ వికెట్స్ ఎక్కువగా ఉండే చాన్స్ ఉంది. రైనా స్పిన్ ను సమర్థంగా ఆడగలడు. అతడి ప్లేస్ లో ఆడించడానికి ఓ ప్లేయర్ నా మైండ్ లో ఉన్నాడు. ఇందుకు మురళీ విజయ్ సమర్థుడైన బ్యాట్స్ మన్ గా భావిస్తున్నా. టీ20 క్రికెట్ లో గత కొన్నేళ్లలో అతడికి ఎక్కువ అవకాశాలు దక్కలేదు. కానీ అతడు చాలా మంచి బ్యాట్స్ మన్ అని చెప్పొచ్చు. లాస్ట్ సీజన్ లో విజయ్ ఎక్కువగా బెంచ్ కే పరిమితమయ్యాడు. కానీ ఈ ఏడాది అతడికి చాలా చాన్సెస్ వస్తాయని అనుకుంటున్నా’ అని వాట్సన్ పేర్కొన్నాడు.

Latest Updates