శుభ్‌‌మన్ గిల్ మరింత దూకుడుగా ఆడాలి

న్యూఢిల్లీ: కోల్‌‌కతా ఓపెనర్ శుభ్‌‌మన్ గిల్ బ్యాటింగ్‌‌పై వెటరన్ బ్యాట్స్‌‌మన్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. రాబోయే మ్యాచుల్లో శుభ్‌‌మన్ గిల్ బౌలర్లను అటాక్ చేస్తూ ఆడాలని వీరూ సూచించాడు. ఒకవేళ అటాకింగ్ చేయడం కుదరకపోతే బ్యాటింగ్ ఆర్డర్‌‌‌ను మార్చుకొని వేరే స్థానంలో దిగాలని సలహా ఇచ్చాడు. ఈ సీజన్‌‌లో ఆడిన 8 మ్యాచుల్లో శుభ్‌‌మన్ గిల్ 275 రన్స్ చేశాడు.

‘శుభ్‌‌మన్ గిల్‌‌కు చాలా అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు గిల్‌‌ను మరింత దూకుడుగా ఆడాలని కేకేఆర్ యాజమాన్యం చెప్పాలి. పవర్ ప్లేలో వేగంగా ఆడాల్సిన సమయం ఆసన్నమైంది. ఇలా కుదరకపోతే బ్యాటింగ్ ఆర్డర్‌‌‌లో అతడ్ని దిగువన ఆడించాలి. గెలవాలంటే తప్పకుండా ఓపెనింగ్ బాగుండాలి. ఓపెనింగ్ బాగుంటేనే మంచి ఇన్నింగ్స్‌‌ను నిర్మించొచ్చు’ అని వీరూ చెప్పాడు.

Latest Updates