బ్యాటింగ్‌‌‌కు పంపుతారనుకోలేదు.. అతడో జీనియస్

యూఏఈ: ఐపీఎల్ పదమూడో సీజన్‌‌ను చెన్నై సూపర్ కింగ్స్ విక్టరీతో గ్రాండ్‌గా మొదలుపెట్టింది. ముంబైపై 162 రన్స్ లక్ష ఛేదనలో రాయుడు, ఫాఫ్ డుప్లెసిస్, జడేజా, సామ్ కరన్ రాణించి చెన్నైను విజయ తీరాలకు చేర్చారు. ముఖ్యంగా 17 బంతుల్లో 27 రన్స్ చేయాల్సిన తరుణంలో క్రునాల్ పాండ్యా బౌలింగ్‌‌లో ఊపు మీద ఉన్న రవీంద్ర జడేజా ఔటయ్యాడు. ఈ టైమ్‌‌లో ఎంఎస్ ధోని లేదా కేదార్ జాదవ్ క్రీజులోకి వస్తారని అందరూ భావించారు. కానీ కెప్టెన్ కూల్ ధోని అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఇంగ్లండ్ ఆల్‌‌రౌండర్ సామ్ కరన్‌‌ను బ్యాటింగ్‌‌కు పంపాడు.

మాహీ నిర్ణయం సక్సెస్ అయ్యింది. క్రీజులోకి వచ్చిన కరన్ ఐదు బాల్స్‌‌లో రెండు సిక్సులు, ఒక ఫోర్ కొట్టాడు. దీంతో సీఎస్‌‌కే కంఫర్టబుల్ పొజిషన్‌‌కు చేరుకుంది. తర్వాతి ఓవర్‌‌లో బుమ్రా బంతికి కరన్ ఔటైనా అప్పటికే తనకు అప్పగించిన పనిని ఫినిష్ చేశాడు. కరన్ నిష్క్రమించాక మిగిలిన పనిని డుప్లెసిస్, ధోని పూర్తి చేశారు. ఇద్దరు కలసి టీమ్‌‌ను గెలిపించారు. కరన్‌‌ను బ్యాటింగ్‌‌కు పంపుతారని ఎవ్వరూ ఊహించలేదు. కరన్‌‌ కూడా ఎక్స్‌‌పెక్ట్ చేయలేదట. తనను బ్యాటింగ్‌కు పంపడం ఆశ్చర్యానికి గురి చేసిందని, ధోని జీనియస్ అంటూ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌‌లో కరన్ చెప్పాడు. చెన్నై తన తర్వాతి మ్యాచ్‌‌లో రాజస్థాన్ రాయల్స్‌‌తో మంగళవారం తలపడనుంది.

Latest Updates