డ్రింక్స్ అందించడానికే పరిమితమైన అత్యధిక వికెట్ల వీరుడు

న్యూఢిల్లీ: చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ గతేడాది ఐపీఎల్‌‌లో 26 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ సాధించాడు. అప్పుడు అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచిన తాహిర్‌‌కు.. ఈ సీజన్‌‌లో మాత్రం సీఎస్కే ఫైనల్ ఎలెవన్‌‌లో చోటు దక్కడం లేదు. రీసెంట్ మ్యాచుల్లో ఇన్నింగ్స్ బ్రేక్‌‌లో చెన్నై ప్లేయర్లకు తాహిర్ డ్రింక్స్ అందిస్తూ కనిపించాడు. దీంతో అతడి ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారు. తాజాగా ఈ విషయంపై తాహిర్ స్పందించాడు. తాను ఆడినా, ఆడకపోయినా టీమ్ గెలుపే తనకు ముఖ్యమని తాహిర్ చెప్పాడు.

‘నేను ఆడుతున్నప్పుడు చాలా మంది ప్లేయర్లు నాకు డ్రింక్స్ తెచ్చి ఇచ్చేవారు. ఆడేందుకు అర్హులైన ఆటగాళ్లు గ్రౌండ్‌‌లో ఉన్నప్పుడు వారికి డ్రింక్స్ అందించి సాయం చేయడం నా బాధ్యత. నేను ఆడుతున్నానా లేదా అనేది పెద్ద విషయం కాదు. టీమ్ గెలవడమే నాకు ముఖ్యం. ఒకవేళ నాకు చాన్స్ వస్తే టీమ్‌‌కు ఏం కావాలో అదివ్వడానికి శాయశక్తులా యత్నిస్తా. ఇదే ఇంపార్టెంట్’ అని తాహిర్ ట్వీట్ చేశాడు.

Latest Updates