ఈ సంవ‌త్స‌రం ఐపీఎల్ -13 విజేత ఎవ‌రంటే

సెప్టెంబ‌ర్ 19 నుంచి ఐపీఎల్ మ్యాచ్ లు జ‌ర‌గ‌నున్నాయి. అన్ని జట్లు ప్రాక్టీస్‌లో నిమగ్నమవుతూ టైటిల్‌ లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.

యూఏఈ వేదికగా ఆరంభం కానున్న ఐపీఎల్ – 13 లో ఎవ‌రు విజ‌యం సాధిస్తారా అని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

ఐపీఎల్ ప్రారంభం అయ్యేందుకు వారం రోజుల స‌మయం ఉంది. ఈ నేప‌థ్యంలో మాజీ క్రికెట‌ర్లు, నిపుణులు, కామెంటీట‌ర్లు యూఏఇకి బ‌య‌లుదేరారు.

ఈ సంద‌ర్భంగా దుబాయ్ కు వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్న ఇంగ్లాండ్ మాజీ బ్యాట్స్‌మన్ కెవిన్ పీటర్సన్ ఈ సంవత్సరం ఐపీఎల్ విజేత ఎవ‌రో చెప్ప‌క‌నే చెప్పారు. ఐపీఎల్ ఎవ‌రు గెలుస్తారా..? అన్న ఉత్కంఠ‌పై పీట‌ర్స‌న్..ఈ సంవ‌త్స‌రం ఐపీఎల్ విజేత ఢిల్లీ టీమ్ అని తాను న‌మ్ముతున్న‌ట్లు ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.

Latest Updates