చెన్నైకి బయలుదేరిన ధోని గ్యాంగ్

రాంచీ: ఐపీఎల్‌ 2020కి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. యూఏఈలో జరిగే మెగా టోర్నీకి సంబంధించిన వసతులు, అరేంజ్‌మెంట్స్‌కు సంబంధించిన పనుల్లో బీసీసీఐ బిజీ అయిపోయింది. మరోవైపు ఫ్రాంచైజీలు కూడా ఆటగాళ్లకు కరోనా టెస్టులు నిర్వహించాక వారిని నెట్‌ ప్రాక్టీస్ క్యాంపులకు తరలిస్తున్నాయి. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని నిబంధనల్లో భాగంగా రెండు సార్లు కరోనా టెస్టులు చేయించుకున్నారు. వాటిల్లో నెగిటివ్‌గా వచ్చిన వెంటనే ఆస్పత్రిలో స్వాబ్‌ను సమర్పించి చెన్నై ఫ్లయిట్ ఎక్కేశాడు. ధోనీతోపాటు అతడి టీమ్‌మేట్స్‌ పీయూష్ చావ్లా, సురేశ్ రైనా, దీపక్ చాహర్, కర్ణ్ శర్మ కూడా జాయిన్ అయ్యారు.

View this post on Instagram

✌️🤟

A post shared by Suresh Raina (@sureshraina3) on

చెన్నై ట్రిప్‌కు సంబంధించిన ఫొటోస్‌ను సోషల్ మీడియాలో రైనా పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలో ధోని, చావ్లా, రైనా, కర్ణ్ శర్మ, చాహర్ ఉన్నారు. ఈ ఫొటోస్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ధోని రాంచీ ఎయిర్‌‌పోర్ట్‌కు తన ఎస్‌యూవీలో వస్తున్న ఫొటోలు కూడా ఫ్యాన్స్‌ను ఆకర్షిస్తున్నాయి. తమను చెన్నైకి తీసుకెళ్తున్న ఎయిర్‌‌లైన్స్‌కు రైనా మప్పిదాలు చెప్పాడు. యూఏఈకి వెళ్లే ముందు ట్రెయినింగ్ క్యాంపు నిర్వహిస్తున్న మొదటి టీమ్‌గా సీఎస్‌కేను చెప్పొచ్చు. బాలాజీ, ధోనీ నేతృత్వంలో కొంత మంది సెలెక్టెడ్ ప్లేయర్లకే ఈ ప్రాక్టీస్ క్యాంపు పరిమితం కానుంది. శనివారం మొదలయ్యే ఈ క్యాంపు 20న ముగుస్తుంది. ఆ తర్వాతి రోజే చెన్నై టీమ్ యూఏఈ బయలుదేరనుంది.

Latest Updates