ఐపీఎల్ ఫస్ట్‌ మ్యాచ్ తోనే వరల్డ్‌ రికార్డు

న్యూఢిల్లీ: కరోనా టైమ్ అనేక అడ్డంకులను దాటుకొని మొదలైన ఐపీఎల్‌–13వ సీజన్‌ ఊహించినట్లే సూపర్ హి ట్‌ అవుతోంది. ఫస్ట్‌ టైమ్‌ ఫ్యాన్స్‌ లేకుండా ఖాళీ స్టేడియంలో జరుగుతున్న ఈ లీగ్ ను టీవీల్లో కోట్లాది మంది చూస్తున్నారు. దాంతో మొదటి మ్యాచే వరల్డ్‌ రికార్డు వ్యూస్ కు చేరుకుంది. ముంబై, చెన్నైమధ్య శనివారం జరిగిన తొలి మ్యాచ్ ను ఏకంగా 20 కోట్ల మంది చూశారని బీసీసీఐ సెక్రటరీ జై షా మంగళవారం ట్వీట్‌ చేశారు. ‘ఓపెనింగ్‌ మ్యాచ్‌ కొత్త రికార్డు సృష్టించింది. బార్క్‌ (బ్రాడ్ కాస్ట్​ ఆడియన్స్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌) లెక్క ప్రకారం ఈ మ్యాచ్ ను 20 కోట్ల మంది చూశారు. ప్రపంచంలో మరే స్పోర్ట్స్‌ లీగ్‌ ఫస్ట్‌ డేకు ఇంత భారీ వ్యూయర్ షిప్‌ రాలేదు’ అని పేర్కొన్నారు.

Latest Updates