యార్కర్ చాలెంజ్.. అదరగొట్టిన ఆర్‌‌‌సీబీ బౌలర్లు

యూఏఈ: ఐపీఎల్ పదమూడో సీజన్‌‌ త్వరలో ప్రారంభమవనున్న నేపథ్యంలో అన్ని జట్లు ట్రెయినింగ్‌‌ను వేగవంతం చేస్తున్నాయి. కింగ్ కోహ్లీ కెప్టెన్సీలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా సన్నాహకాల్లో స్పీడ్‌‌గా ముందుకెళ్తోంది. గత సీజన్లలో తమ చెత్త పెర్ఫామెన్స్ నుంచి బయట పడాలని తీవ్రంగా శ్రమిస్తోంది. వైవిధ్యమైన ట్రెయినింగ్ సెషన్స్‌‌తో ఎక్స్‌‌ట్రా ఎఫర్ట్ పెడుతోంది. తాజాగా ఆ జట్టు ట్విట్టర్ హ్యాండిల్‌‌లో పోస్టు చేసిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. స్పిన్నర్లు, పేసర్లకు విసిరిన యార్కర్ చాలెంజ్‌‌లో ఆర్సీబీ బౌలర్లు స్టంప్స్‌‌ను హిట్ చేస్తూ కనిపించారు. కోహ్లీతోపాటు మిగిలిన్ బ్యాట్స్‌‌మన్స్ వారిని ఎంకరేజ్ చేస్తూ, సరదగా ఆటపట్టిస్తుండటాన్ని వీడియోలో చూడొచ్చు.

బౌలింగ్ కోచ్ ఆడమ్ గ్రిఫిత్ వికెట్‌‌కు సమీపంలో ఏర్పాటు చేసిన పలు స్టంప్స్‌‌ను హిట్ చేయడమే బౌలర్ల టార్గెట్. గురుకీరత్ సింగ్ మాన్, ఇసురు ఉడాన, నవ్‌‌దీప్ సైనీ, లెగ్గీ యుజ్వేంద్ర చాహల్, ఆల్ రౌండర్స్ శివం దూబే, షాబాజ్ అహ్మద్ స్టంప్స్‌‌ను కొట్టడంలో సక్సెస్ అయ్యారు. ఈ వీడియోకు టీమ్ బౌలింగ్ కోచ్ ఆడమ్ గ్రిఫిత్ మంచి సరదా చాలెంజ్‌‌తో ముందుకొచ్చారని, ఈ సవాల్ తమ బౌలర్లు యార్కర్‌‌లతో దుమ్మురేపారనే క్యాప్షన్‌‌‌ను ఆర్సీబీ ట్వీట్‌‌లో జత చేసింది. తమ బౌలర్లు అందరూ షార్స్ షూటర్స్ అని చెప్పడానికి సంతోషిస్తున్నామని ట్వీట్ చేసింది.

Latest Updates