ఐపీఎల్‌‌లో ఇదే బెస్ట్ క్యాచ్.. సూపర్‌‌మ్యాన్ తరహాలో ఫీల్డింగ్ విన్యాసం

షార్జా: ఐపీఎల్ పదమూడో సీజన్‌‌లో ఆదివారం రసవత్తర పోరు జరిగింది. కింగ్స్ ఎలెవన్‌‌తో జరిగిన పోరులో రాజస్థాన్ రాయల్స్ ఉత్కంఠ విజయం సాధించింది. ఈ విషయాన్ని అటుంచింతే.. రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ సమయంలో పంజాబ్ ప్లేయర్ నికోలస్ పూరన్ ఓ సిక్స్‌‌ను ఆపిన విధానం వైరల్ అవుతోంది. సూపర్‌‌మ్యాన్ తరహాలో గాలిలో ఎగురుతూ బంతిని పట్టి విసిరేసిన తీరుకు నెటిజన్స్, క్రికెట్ ఫ్యాన్స్‌‌తో పాటు జాంటీ రోడ్స్ లాంటి ఫీల్డింగ్ లెజెండ్ కూడా షాకవుతున్నారు.

రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్‌‌లో 26 రన్స్ వద్ద ఉన్న శాంసన్ లాంగాఫ్ దిశగా భారీ షాట్ కొట్టాడు. బంతి కోసం కాచుకొని నిలబడ్డ పూరన్ దాన్ని అందుకునే ప్రయత్నంలో గాలిలో దూకాడు. అయితే తాను బౌండరీ లైన్‌‌ ఆవల ఉన్నానని గ్రహించిన పూరన్.. వెంటనే బాల్‌‌ను లైన్ లోపలికి విసిరాడు. దీంతో బ్యాట్స్‌‌మెన్ రెండు పరుగులు తీశారు. నాలుగు రన్స్‌‌ను కాపాడిన పూరన్ ఫీల్డింగ్ విన్యాసానికి అందరూ ఫిదా అవుతున్నారు. తాను చూసిన ఫీల్డింగ్‌‌‌లో ఇదే బెస్ట్ అని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ చెప్పాడు. ‘ఇలాంటి ఫీల్డింగ్‌‌ను నేనెప్పుడూ చూడలేదు. రోప్‌‌ మీదుగా రెండు గజాల దూరం ఎగిరి బాల్‌‌ను వెనక్కి నెట్టాడు. వావ్, ఇది అద్భుతం’ అని పీటర్సన్ మెచ్చుకున్నాడు.

Latest Updates