టీమిండియాలో అతడ్ని ఎందుకు ఆడించడం లేదు?

యూఏఈ: ఐపీఎల్ పదమూడో సీజన్‌‌ను రాజస్థాన్ రాయల్స్ విజయంతో ఆరంభించింది. యంగ్ వికెట్ కీపర్, బ్యాట్స్‌‌మన్ సంజూ శాంసన్ (32 బంతుల్లో 74) మెరుపు ఇన్నింగ్స్‌‌తో రాయల్స్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో సంజూ ఇన్నింగ్స్‌‌పై రాజస్థాన్ రాయల్స్ బ్రాండ్ అంబాసిడర్, ఆస్ట్రేలియా లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్ స్పందించాడు. సంజూ లాంటి ట్యాలెంటెడ్ బ్యాట్స్‌‌మన్‌ను‌ టీమిండియా ఆడే అన్ని ఫార్మాట్స్‌‌లో ఆడించకపోవడంపై వార్న్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

‘సంజూ శాంసన్ అద్భుతమైన ఆటగాడు. చాన్నాళ్లుగా అతడ్ని గమనిస్తున్నా. శాంసన్ ఎగ్జయిటింగ్ ప్లేయర్స్‌‌లో ఒకడు. టీమిండియా తరఫున అన్ని ఫార్మాట్ల క్రికెట్‌‌లో అతణ్ని ఆడించకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అతడు చాలా మంచి ప్లేయర్. అతడో చాంపియన్. శాంసన్ అన్ని రకాల షాట్లు ఆడగలడు. అతడి క్లాస్, క్వాలిటీ ముచ్చట గొల్పుతుంది. ఈ ఐపీఎల్ సీజన్‌‌లో శాంసన్ బాగా ఆడాలని, అలాగే టీమిండియా తరఫున అన్ని ఫార్మాట్లలో అతడు ప్రాతినిధ్యం వహించాలని ఆశిస్తున్నా’ అని వార్న్ చెప్పాడు.

Latest Updates