ఇవాళ ముంబైతో ఢిల్లీ అమీతుమీ

నేడు క్వాలిఫయర్‌‌‌‌-1లో ఢిల్లీతో ఢీ

సూపర్‌‌ ఫామ్‌‌లో ఇరుజట్లు

రోహిత్‌‌ రాకతో పెరిగిన ఇండియన్స్​ బలం

ఓవైపు ఐపీఎల్‌‌లో అత్యంత సక్సెస్‌ ఫుల్‌‌ హిస్టరీ ఉన్న ముంబై.. మరోవైపు అత్యంత చెత్త చరిత్ర ఉన్న ఢిల్లీ..! ఒకటేమో నాలుగుసార్లు చాంపియన్‌ గా నిలిచిన టీమ్‌ ..
మరొకటేమో ఫస్ట్‌‌ టైటిల్‌‌ కోసం వేట మొదలుపెడుతున్న టీమ్‌ ..! ఈ నేపథ్యంలో క్వాలిఫయర్‌‌–1 మ్యాచ్‌ కోసం ఇరు జట్లు సిద్ధమయ్యాయి..! చరిత్రను కాసేపు
పక్కనబెడితే.. ఈసారి బలం, బలగం ప్రకారం రెండు జట్లు సమానంగా కనిపిస్తున్నాయి..! అయితే ఎక్స్‌‌పీరియెన్స్‌‌ పరంగా ముంబైకి కాస్త అడ్వాంటేజ్‌ ఉన్నా..
ఈ సీజన్‌ లో ఢిల్లీ ఓ రేంజ్‌ లో దూసుకొచ్చింది..! పోరాడితే పోయేదేమీ లేదన్న తరహాలో సూపర్‌‌ విక్టరీలతో అదరగొట్టడంతో ఈ మ్యాచ్‌ పై ఎనలేని ఆసక్తి
మొదలైంది..! మరి ముంబైని ఆపి.. ఫస్ట్​ క్వాలిఫయర్ తోనే టైటిల్‌‌ వేటలో ఢిల్లీ కాలుమోపుతుందా? లేక మరో మ్యాచ్‌ వరకు ఆగుతుందా? చూడాలి..!!

దుబాయ్: కరోనా అడ్డంకులను అధిగమించి సూపర్‌‌ సక్సెస్‌‌ అయిన ఐపీఎల్‌‌–13 చివరి దశకు చేరుకుంది. లీగ్‌‌ స్టేజ్‌‌లో అత్యత్తుమ పెర్ఫామెన్స్‌‌ చూపిన నాలుగు టీమ్‌‌లు ప్లే ఆఫ్స్‌‌లో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో గురువారం జరిగే  క్వాలిఫయర్‌‌–1లో బలమైన ముంబై ఇండియన్స్‌‌ను ఢీకొట్టేందుకు ఢిల్లీ క్యాపిటల్స్‌‌ సిద్ధమైంది. స్టార్లతో నిండిన ముంబై ఈ మ్యాచ్‌‌లో ఫేవరెట్‌‌ కనిపిస్తోంది. దీనికితోడు లీగ్‌‌ దశలో రెండుసార్లూ ఢిల్లీని ఓడించడం కూడా ఆ టీమ్​కు అడ్వాంటేజ్‌‌గా మారింది. అయితే లాస్ట్‌‌ లీగ్‌‌ మ్యాచ్‌‌లో సన్‌‌రైజర్స్‌‌ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడటం రోహిత్‌‌సేన ఆత్మవిశ్వాసాన్ని కొద్దిగా దెబ్బతీస్తున్నది. మరోవైపు నాలుగు వరుస పరాజయాల తర్వాత అద్భుతంగా పుంజుకున్న ఢిల్లీ.. ఆఖరి మ్యాచ్‌‌లో బలమైన బెంగళూరుకు చెక్‌‌ పెట్టడం కాన్ఫిడెన్స్‌‌ను పెంచే అంశం. ఓవరాల్‌‌గా బలమైన హిట్టర్లు, అంతకుమించిన ఆల్‌‌రౌండర్లు ఉండటంతో ఇరుజట్ల మధ్య పోరాటం కూడా అంతే స్థాయిలో ఉండనుంది. అయితే ఫస్ట్‌‌ టైమ్‌‌ టైటిల్‌‌ కోసం వేట మొదలుపెడుతున్న ఢిల్లీపై కాస్త అధిక ఒత్తిడి ఉండే చాన్స్‌‌ ఉంది. దీనిని అధిగమించగలిగితే రసవత్తర పోరాటం మాత్రం ఖాయం.

హిట్​మ్యాన్ ​నిలబడితే..

తొడ కండరాల గాయంతో నాలుగు మ్యాచ్‌‌లకు దూరమైన ముంబై కెప్టెన్‌‌ రోహిత్‌‌.. తిరిగి బరిలోకి దిగడం అతిపెద్ద సానుకూలాంశం. కెప్టెన్‌‌ రాకతో ఆ టీమ్​ బ్యాటింగ్‌‌ బలం పెరిగిపోయింది. అయితే హైదరాబాద్‌‌తో మ్యాచ్‌‌లో ఫెయిలవడంతో రోహిత్‌‌పై కొద్దిగా ప్రెజర్‌‌ ఉంది. దీంతో ఈ మ్యాచ్​లో భారీ స్కోరు సాధించాలని అతను టార్గెట్‌‌గా పెట్టుకున్నాడు. ఇక ముంబై టాప్‌‌ ఆర్డర్‌‌ మొత్తం ఫుల్‌‌ జోష్‌‌లో ఉంది. యంగ్‌‌స్టర్​ ఇషాన్‌‌ కిషన్‌‌ (428), క్వింటన్​ డికాక్‌‌ (443), సూర్యకుమార్‌‌ యాదవ్‌‌ (410) ఫామ్‌‌ కొనసాగిస్తే  పరుగుల వరద పారినట్లే. మిడిలార్డర్‌‌లో సిక్స్‌‌ హిట్టింగ్‌‌ పవర్‌‌హౌజ్‌‌లు హార్దిక్‌‌ పాండ్యా (241), పొలార్డ్‌‌ (259), క్రునాల్‌‌ పాండ్యా (95) చెలరేగితే భారీ స్కోరు ఖాయం. స్లాగ్ ఓవర్లలో వీళ్లలో ఏ ఇద్దరు క్రీజులో ఉన్నా.. ప్రత్యర్థి బౌలర్లకు కష్టాలు తప్పవు. బ్యాటింగ్‌‌లో ముంబై ఎంత బలంగా ఉందో బౌలింగ్‌‌లోనూ అంతకుమించి ఉంది.  స్టార్ట్‌‌, డెత్‌‌ ఓవర్లలో బుమ్రా (23 వికెట్లు), ట్రెంట్‌‌ బౌల్ట్‌‌ (20 వికెట్లు) పేస్‌‌కు ఎదురొడ్డి నిలవాలంటే ఢిల్లీ బ్యాట్స్​మెన్​ సాహసం చేయాల్సిందే. స్పిన్నర్లు రాహుల్‌‌ చహర్‌‌ (15 వికెట్లు), క్రునాల్‌‌ (5 వికెట్లు) మిడిల్‌‌ ఓవర్స్‌‌ను చూసుకుంటే సరిపోతుంది. అయితే హైదరాబాద్‌‌తో మ్యాచ్‌‌లో ఈ ఇద్దరూ విఫలం కావడం కాస్త ఆందోళన కలిగిస్తున్నది. ఇక ఫీల్డింగ్‌‌లోనూ ముంబై ఓ మెట్టుపైనే ఉంది.

ఇద్దరిపైనే భారం..

పేపరు మీద ఢిల్లీ  క్యాపిటల్స్​ లైనప్‌‌ అద్భుతంగా కనిపిస్తున్నది. ఓపెనింగ్‌‌లో ధవన్‌‌ (525) రెండు సెంచరీలు, మూడు హాఫ్‌‌ సెంచరీలతో సూపర్‌‌ ఫామ్‌‌లో ఉన్నాడు. ఇది కంటిన్యూ చేస్తే ఢిల్లీకి చాలా వరకు ఇబ్బందులు తప్పినట్లే. అయితే రెండో ఎండ్‌‌ నుంచి ధవన్‌‌కు మంచి సపోర్ట్‌‌ కరువైంది. పృథ్వీ షా (228)లో దూకుడు తగ్గింది. రహానె (111) వచ్చిన చాన్స్‌‌ను సూపర్బ్‌‌గా వినియోగించుకుంటున్నా.. రిషబ్‌‌ పంత్‌‌ (282) ఫామ్‌‌ ఆందోళన కలిగిస్తున్నది. షా, పంత్‌‌.. ఇద్దరూ అంచనాలను అందుకోలేకపోతుండటం ఢిల్లీకి తలనొప్పిగా మారింది. మిడిలార్డర్‌‌లోనూ క్యాపిటల్స్‌‌కు ఇబ్బందులు ఉన్నాయి. హెట్‌‌మయర్‌‌ (138), స్టోయినిస్‌‌ (249) కీలక ఇన్నింగ్స్‌‌ ఆడలేకపోతున్నారు. కెప్టెన్‌‌ శ్రేయస్‌‌ అయ్యర్‌‌ (421) యాంకర్‌‌ రోల్‌‌ పోషిస్తుండటం కలిసొచ్చే అంశం. ఓవరాల్‌‌గా ఢిల్లీ బ్యాటింగ్‌‌ మొత్తం ధవన్‌‌, అయ్యర్‌‌పైనే ఎక్కువగా ఆధారపడటం ప్రతికూలాంశం. బౌలింగ్‌‌లో మాత్రం క్యాపిటల్స్‌‌కు తిరుగులేదు. సౌతాఫ్రికా ద్వయం రబాడ (25 వికెట్లు), అన్రిచ్‌‌ నోకియా (19) సూపర్‌‌ బౌలింగ్‌‌తో ఆకట్టుకుంటున్నారు. స్పిన్నర్లు  అశ్విన్‌‌, అక్షర్‌‌ పటేల్‌‌ కూడా మంచి టర్నింగ్‌‌తో ఫర్వాలేదనిపిస్తున్నారు. అయితే ముంబై హిట్టర్లను వీళ్లు ఎంతమేరకు కట్టడి చేస్తారో చూడాలి. ఏదేమైనా లీగ్‌‌ దశలో ఎదురైన రెండు పరాజయాలకు ఈ మ్యాచ్‌‌లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని ఢిల్లీ ప్లాన్స్‌‌ చేస్తోంది.

జట్లు (అంచనా)

ముంబై: రోహిత్‌‌ (కెప్టెన్‌‌), డికాక్‌‌ (కీపర్​), సూర్యకుమార్‌‌, ఇషాన్‌‌, సౌరభ్‌‌ తివారి, హార్దిక్‌‌ పాండ్యా, పొలార్డ్‌‌, క్రునాల్‌‌, రాహుల్‌‌ చహర్‌‌, బౌల్ట్‌‌, బుమ్రా.

ఢిల్లీ: పృథ్వీ, ధవన్‌‌, రహానె, శ్రేయస్‌‌ (కెప్టెన్​), రిషబ్‌‌ (కీపర్​), స్టోయినిస్‌‌, హెట్‌‌మయర్‌‌, అశ్విన్‌‌, అక్షర్‌‌, అన్రిచ్‌‌, రబాడ.

 

 

Latest Updates