ఫిబ్రవరి 18న ఐపీఎల్‌ వేలం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వేలం ఫిబ్రవరి 18న జరగనుంది. IPL 2021కి సంబంధించి క్రికెటర్ల వేలం వచ్చేనెల 18న జరుగుతుందని బీసీసీఐ తెలిపింది. అయితే వేలం వేదికను ఇంకా ఖరారు చేయలేదు. ఐపీఎల్‌ 2021 ఇండియాలోనే నిర్వహిస్తామని గతంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ తెలిపాడు.

కరోనా వ్యాప్తి కారణంగా IPL 2020ను దుబాయ్‌కు తరలించింది BCCI. ఈసారి మెగా టోర్నీని భారత్‌లోనే నిర్వహించేందుకు కృషి చేస్తున్నట్లు గంగూలీ ప్రకటించాడు.

Latest Updates