ఐపీఎల్ బెట్టింగ్.. రూ. 4 కోట్లు,19 ఫోన్లు స్వాధీనం

ఐపీఎల్ బెట్టింగ్ జోరుగా సాగుతుంది.  ఈ సారి కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. బాల్ కో రేటు, మ్యాచ్ కో రేటు అంటూ  బెట్టింగ్ కాస్తున్నారు.  జైపూర్ పోలీసులు  భారీ బెట్టింగ్ రాకెట్టును ఛేదించారు. నలుగురిని అరెస్టు చేశారు పోలీసులు.  వారి నుంచి రూ .4 కోట్లకు పైగా నగదు, 19 మొబైల్ ఫోన్లు, రెండు నోట్ కౌంటింగ్ మిషన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గుజరాత్ కు చెందిన  రణదీప్ సింగ్, కపల్ సింగ్,  అజ్మీర్ గా గుర్తించారు.  వీరిద్దరూ ఐపిఎల్ బెట్టింగ్ రాకెట్టు నడుపుతుండగా.. మరో ఇద్దరు వారికి సహాయం చేస్తున్నారని పోలీసులు చెప్పారు.

దేశంలో 10 కోట్లు దాటిన కరోనా టెస్టులు

ముంబైలో భారీ అగ్నిప్రమాదం.. మంటలార్పుతున్న 24 ఫైరింజన్లు

Latest Updates