ఈ ఏడాది ఐపీఎల్‌‌ ఉంటుంది.!

ముంబై : కరోనా దెబ్బకు ఒలింపిక్స్‌‌సహా అన్ని స్పోర్టింగ్‌‌ ఈవెంట్స్‌‌వాయిదా పడగా.. ఐపీఎల్‌‌13వ ఎడిషన్‌‌పై ముంబై ఇండియన్స్‌‌కెప్టెన్‌‌ రోహిత్‌‌ శర్మ ఇంకా ఆశలు వదులుకోలేదు. పరిస్థితులు అదుపులోకి వచ్చాక ఏదో ఒక టైమ్‌‌లో లీగ్‌‌ జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్‌‌ మాజీ క్రికెటర్ కెవిన్‌‌ పీటర్సన్‌‌.. ఇన్‌‌స్టాగ్రామ్‌‌ వేదికగా గురువారం చేసిన ఇంటర్వ్యూలో కూతురు సమైరాతో కలిసి రోహిత్‌‌ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఐపీఎల్‌‌13వ ఎడిషన్‌‌గురించి కెవిన్‌‌ప్రశ్నించగా..‘ఉత్కంఠతో ఉన్నా. పరిస్థితులు సద్దుమణిగితే ఏదో ఒక సమయంలో లీగ్‌‌జరుగుతుంది’ అని రోహిత్‌‌ చెప్పాడు. అంతేకాక క్రిస్‌‌లిన్‌‌, ట్రెంట్‌‌బౌల్ట్‌‌, నేథన్‌‌ కూల్టర్‌‌ నైల్‌‌ఈ సీజన్‌‌లో  ముంబై ఇండియన్స్‌‌కు ఆడనుండడం సంతోషంగా ఉందన్నాడు. వాంఖడేలో పిచ్‌‌ కండిషన్స్‌‌బౌల్ట్‌‌కు అనుకూలంగా ఉంటాయని, అతని స్వింగ్‌‌ బౌలింగ్‌‌ చూసేందుకు ఎదురు చూస్తున్నానని తెలిపాడు.

లీగ్ ఎప్పుడు జరిగినా నేను రెడీ

Latest Updates