పాక్ తో భారత్ క్రికెట్ ఆడదు

పాకిస్తాన్ తో భారత్ ధ్వైపాక్షిక సిరీస్ ఆడేది లేదని తెలిపారు ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా. ప్రస్తుతం దేశంలో విపత్కరపరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. జాతీయ మీడియాకు ఇంటర్వూ ఇచ్చిన ఆయన కేంద్ర ప్రభుత్వం ఒప్పుకునే వరకు పాకిస్తాన్ తో టీమిండియా క్రికెట్ ఆడదని చెప్పారు.

ఉగ్రవాదులను ప్రోత్సహించి భారత్ లో ఉగ్ర దాడులు చేయిస్తున్న పాకిస్తాన్ తగిన మూల్యం చెల్లించుకుంటుందని అన్నారు. రానున్న ప్రపంచకప్ లో పాకిస్తాన్ తో భారత్ ఆడే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. పుల్వామా దాడిపై దేశ ప్రజలు ఆవేదనతో ఉన్నరని అన్నారు.

పుల్వామా దాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు పలువురు క్రికెటర్లు తమకు తోచినంత సహాయం చేశారు. భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. పుల్వామాలో వీరమరణం పొందిన జవాన్ల పిల్లలకు తన స్కూల్ లో ఉచిత విద్యను అందించనున్నారు. పుల్వామా దాడికి కారకుడైన జైషే మహమ్మద్ మాజీ కమండర్ అబ్దుల్ రషీద్ ఘాజీని నిన్న రాత్రి కశ్మీర్ లో మట్టు బెట్టింది భారత ఆర్మీ.

 

Latest Updates