IPL : చెన్నై టార్గెట్-148

ఢిల్లీ : చెన్నైతో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ ఇన్నింగ్స్ పూర్తైంది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ తక్కువ స్కోరుకే పరిమితమైంది. నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి147 రన్స్ చేసింది. రిషబ్ పంత్ భారీ స్కోర్ దిశగా ఆడేసమయంలో బ్రావో దెబ్బతీశాడు. 16 వ ఓవర్ లో టీమ్ స్కోర్ 120 దగ్గర పంత్ ఔట్ అయ్యాడు. పంత్ ఉన్నంతసేపు స్పీడ్ గా ఆడాడు. అతడు ఔట్ అయిన వెంటనే ఆ తర్వాత వచ్చిన కొలిన్ ఇన్ గ్రామ్ ను కూడా ఔట్ చేసి ఢిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేశాడు బ్రావో. వెంటనే ధావన్ కూడా బ్రోవో బౌలింగ్ లోనే ఓట్ అయ్యాడు. దీందో లాస్ట్ 5  ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఢిల్లీ.. 29 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఢిల్లీ ప్లేయర్లలో ..ధావన్(51), పంత్ (25), పృద్వీషా(24) తప్ప మిగతా ప్లేయర్లు రాణించలేకపోయారు.

చెన్నై బౌలర్లలో ..బ్రావో(3), ఇమ్రాన్ తాహీరో, జడేజా, చాహర్  తలో వికెట్ తీశారు.

Latest Updates