IPL: కోత్ కతాపై ఢిల్లీ సూపర్ విక్టరీ

ఢిల్లీ : నరాల తెగే ఉత్కంఠ మధ్య సాగిన మ్యాచ్‌ లో ఢిల్లీ క్యాపి టల్స్‌ జట్టు కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌ పై ‘సూపర్‌ ’ విజయం సాధించిం ది. సూపర్‌ ఓవర్‌ కు దారి తీసిన మ్యాచ్‌ లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 3 రన్స్​ తేడాతో  రైడర్స్‌ పై గెలిచింది. అంతకముందు రసెల్‌ (28 బంతుల్లో 4ఫోర్లు, 6 సిక్స్‌ లతో 62), దినేశ్‌ కార్తీక్‌ (36 బంతుల్లో 5ఫోర్లు, 2సిక్స్‌ లతో 50) హాఫ్‌ సెంచరీలతో చెలరేగడంతో టాస్‌ ఓడి ఫస్ట్‌‌‌‌ బ్యాటింగ్‌ చేసిన కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టా నికి 185 రన్స్‌ చేసింది. హర్షల్‌ పటేల్‌ (2/40) రెండు వికెట్లు తీయగా,రబాడా, లమిచనె, మోరిస్‌ , మిశ్రా ఒక్కో వికెట్‌ తీశారు. ఛేజింగ్‌ లో 20 ఓవర్లు ఆడిన ఢిల్లీ క్యాపి టల్స్‌ ఆరు వికెట్ల నష్టానికి 185 రన్స్‌ చేసింది. ఓపెనర్‌ పృథీ షా(55 బంతుల్లో 12 ఫోర్లు,3 సిక్స్‌ లతో 99) ధనాధన్‌ బ్యాటింగ్‌ కు తోడు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (32 బంతుల్లో 4 ఫోర్లు, 2సిక్స్‌ లతో 43) చెలరేగడంతో క్యాపిటల్స్‌ మ్యాచ్‌ లో సులువుగా గెలిచేలా కనిపించింది.

అయితే ఆఖర్లో పృథ్వీ ఔటైన తర్వాత క్యాపిటల్స్‌ తడబడింది.ఫెర్గూసన్‌ వేసిన షార్ట్‌‌‌‌బా ల్‌ ను ఆడబోయిన పృథ్వీ వికెట్‌ కీపర్‌ కార్తీక్‌ కు క్యాచ్‌ ఇచ్చి సెంచరీ అవకాశాన్ని మిస్‌ చేసుకున్నాడు. అంతకముందు రిషభ్‌ పంత్‌ (11) నిరాశపరచగా, 20వ ఓవర్లో హనుమ విహారి(2) భారీ షాట్‌ కు యత్నించి ఔటయ్యా డు. ఆఖరి బాల్ కి రెండు పరుగులు కావాల్సిన సమయంలో సెకండ్‌ రన్‌ కు యత్నించి ఇంగ్రామ్‌ రనౌట్‌ అవ్వడంతో మ్యాచ్‌ డ్రా అయ్యింది. రైడర్స్‌ బౌలర్లలో కుల్దీప్‌ రెండు వికెట్లు తీశాడు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ కు దిగిన నైట్‌ రైడర్స్‌ కు శుభారంభం దక్కలేదు. పది ఓవర్లు పూర్తి కాకముందే టాపార్డర్‌ అంతా డగౌట్‌ చేరింది. ఈ దశలో కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ , రసెల్‌ క్రీజులో పాతుకుపోయి జట్టుకు భారీ స్కోరు అందించారు. వీరిద్దరూ కలిసి ఆరో వికెట్‌ కు 52 బంతుల్లో 91 రన్స్‌ జోడించడంతో ఆఖరి పది ఓవర్లలో కేకేఆర్‌ 121 రన్స్‌ చేసింది. సన్‌ రైజర్స్‌ , కింగ్స్‌ పంజాబ్‌ కు చుక్కలు చూపించిన రసెల్‌ ఢిల్లీ బౌలర్లను అంతకుమించి ఆడుకున్నా డు. ఎదుర్కొన్న ఐదో బంతికే సిక్సర్‌ కొట్టిన రసెల్‌ 23బంతుల్లో హాఫ్‌ సెంచరీ మార్క్‌‌‌‌ దాటాడు.

14వ ఓవర్లో హర్షల్‌ పటేల్‌ వేసిన బీమర్‌ భుజానికి బలంగా తగలడంతో కాసేపు ఇబ్బం ది పడ్డ రసెల్‌ ఆ తర్వాత సిక్స్‌ ల వర్షం కురిపించాడు. హర్షల్‌ వేసిన16వ ఓవర్లో రెండు భారీ సిక్స్‌ లు కొట్టిన రసెల్‌ ఆ తర్వాత మోరిస్‌ వేసిన 18వ ఓవర్‌ లో భారీ షాట్‌ కు యత్నించి క్యాచ్‌ ఔటయ్యా డు. మరో ఎండ్‌ లో కార్తీక్‌ కూడా ధాటిగా ఆడాడు. 35 బాల్స్‌ లో హాఫ్‌ సెంచరీ చేసిన కార్తీక్‌ ఆ తర్వాత బంతికే మిశ్రా బౌలింగ్‌ లో కీపర్‌ కి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. చివర్లో చావ్లా(12), కుల్దీప్‌ (10 నాటౌట్‌ ) కూడా వేగంగా పరుగులు చేశారు. అంతకముందు ఇన్నింగ్ స్‌ నాలుగో ఓవర్లో కేకేఆర్ తొలి వికెట్‌ కోల్పోయింది. లమిచానె బౌలింగ్‌ లో ఓపెనర్‌ నిఖిల్‌ నాయక్‌ (7) వికెట్ల ముందు దొరికిపోగా, ఆరో ఓవర్‌ ఆఖరి బంతికి హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌ లో రాబిన్‌ ఊతప్ప(11) ఎల్బీడబ్ల్ యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత రబాడా బౌలింగ్‌ లో మరో ఓపెనర్‌ క్రిస్‌ లిన్‌ (20) కీపర్‌ పంత్‌ కు క్యాచ్‌ ఇచ్చాడు. ఆ వెంటనే హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌ లో ఫైన్‌ లెగ్‌ మీదుగా భారీ షాట్‌ కు యత్నించిన నితీశ్‌ రాణా(1) బౌండ్రీలైన్‌ వద్ద రబాడాకు క్యాచ్‌ ఇచ్చాడు. పదో ఓవర్‌ తొలి బంతికి శుభన్‌గిల్‌ (2) రనౌటయ్యా డు.

Latest Updates