కమాన్ పప్పా అంటూ ఎంకరైజ్ : రచ్చ చేసిన ధోనీ కూతురు

ఢిల్లీ : క్రికెటర్లు గ్రౌండ్ లో ఉండగ తమ ఫ్యామిలీ మెంబర్స్ ఎంకరైజ్ చేయడం తెలుసు కదా. కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అనుష్క సంబరపడిపోవడం, అలాగే మరికొంత రోహిత్, ధోనీ భార్యలు కూడా ఎక్కువగా స్టేడియంలో కనిపిస్తుంటారు. ప్రస్తుతం ఐపీఎల్ లో భార్యలే కాక, క్రికెటర్ల బిడ్డలు చేసే రచ్చ అంతా ఇంత కాదు. మంగళవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో చెన్నై కెప్టెన్ ధోనీ బ్యాటింగ్ చేస్తుండగా స్టేడియంలో అతడి కూతరు జీవా కేకలు వేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.

ధోని స్లోగా బ్యాటింగ్‌ చేస్తుండటంతో.. గ్యాలరీలో ఉన్న జీవా.. ‘పప్పా.. కమాన్‌ పప్పా’  అని బిగ్గరగా అరుస్తూ తండ్రిని ప్రోత్సహించింది. ఈ వీడియోను చెన్నైసూపర్‌ కింగ్స్‌ తన అఫీషియల్ ట్విటర్‌ లో పోస్ట్ చేయడంతో తెగ వైరల్‌ అయింది. ఇక ఈ మ్యాచ్‌ లో చెన్నై 6 వికెట్లతో ఘన విజయం సాధించింది. క్లిష్ట పరిస్థితుల్లో ధోని(35 బంతుల్లో 32 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌), జాదవ్‌ (34 బంతుల్లో 27; 2 ఫోర్లు)  నాలుగో వికెట్‌కు 54 బంతుల్లో 48 పరుగులు జోడించి జట్టును గెలిపించాడు.

Latest Updates