IPL: హైదరాబాద్ కు ‘డు ఆర్ డై’ మ్యాచ్

ఐపీఎల్ 12వ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ చావో రేవో లాంటి మ్యాచ్ కు సిద్ధమైంది.ఇవాళ( శనివారం) రాయల్స్‌‌ చాలెంజర్స్‌‌ బెంగళూరుతో  పోటీ పడనుంది. ఈ మ్యాచ్‌ లో గెలవడంతో పాటు కొన్ని సమీకరణాలు కలిసొస్తే ప్లే ఆఫ్‌ కు ఆరెంజ్‌ ఆర్మీ చేరుకుంటుంది. మరోవైపు నాకౌట్‌ రేసు నుంచి ఇప్పటికే తప్పుకున్న బెంగళూరు ఈమ్యాచ్‌ లో గెలిచి సీజన్‌ను ముగించాలని కోరుకుంటోంది.

మనీశ్ అదరహో…

సన్‌ రైజర్స్ కీలకమైన బ్యాట్స్‌‌మెన్‌ జానీ బెయిర్‌‌స్టో , డేవిడ్‌ వార్నర్ దూరమైనవేళ వారిని మరిపించేలా వన్‌ డౌన్‌ బ్యాట్స్‌‌మన్‌ మనీశ్‌ పాండే అలరిస్తున్నా డు. ముంబై ఇండియన్స్‌‌తో గురువారం తాను ఆడిన ఇన్నింగ్స్‌‌ చాలు అతని విలువేంటోచాటి చెబుతోంది. అందరూ విఫలమైన వేళ జట్టును ఒంటి చేత్తో సూపర్‌‌ ఓవర్‌‌ వరకూ తీసుకొచ్చాడు. అయితే అతనికి సహచరుల నుంచిసహకారం లభించాల్సి ఉంది. మార్టిన్‌ గప్టిల్‌‌,వృద్ధిమా న్‌ సాహా చివరి దశలో అవకాశాలు దక్కించుకున్నప్పటికీ వారు బ్యాటింగ్‌‌ ఝుళిపించాల్సి న అవసరముంది. అలాగే మిడిలార్డర్‌‌లోకేన్‌ విలియమ్సన్‌ నాయకుడై నడిపించాలి.విజయ్‌ శంకర్‌‌ గాడిన పడాల్సిన అవసరముంది. ఆల్‌‌రౌండర్లలో మహ్మద్‌ నబీ, రషీద్‌ ఖాన్‌ సత్తాచాటుతున్నారు. బౌలర్లలో ఖలీల్‌‌ అహ్మద్‌ అంచనాలకు మించి రాణిస్తున్నాడు. సీనియర్‌‌ పేసర్‌‌ భువనేశ్వర్‌‌ కుమార్‌‌, సందీప్‌ శర్మల నుంచి తనకుసహకారం లభించాల్సి ఉంది. అయితే సన్‌ రైజర్స్‌‌ ఈ మ్యాచ్‌ ఓడినా నాకౌట్‌ చేరే అవకాశముంది. కోల్‌‌కతా నైట్‌ రైడర్స్‌‌, కింగ్స్‌‌ లెవన్‌ పంజాబ్‌ తమచివరి 2 మ్యాచ్‌ ల్లో కేవలం ఒక్క దాంట్లో గెలిస్తే ఆరెంజ్‌ ఆర్మీ నాకౌట్‌కు చేరుతుంది. అయితే ఇలాంటి సమీకరణాలు ఏమీ అవసరం లేకుండా బెంగళూరుపై విజయం సాధించగలిగితే సన్‌ రైజర్స్‌‌ ప్లే ఆఫ్‌ కు చేరుతుంది.

విజయంతో ముగించాలని…

ఈ సీజన్‌లో అందరికంటే ముందు ప్లే ఆఫ్‌ నుంచి వైదొలిగిన జట్టుగా అపఖ్యాతి మూటగట్టుకున్నబెంగళూరు.. ఈ మ్యాచ్‌ లో పరువు కోసంబరిలోకి దిగుతోంది. సొంతగడ్డపై జరుగుతున్నఈ మ్యాచ్‌ లో నెగ్గి అభిమానులకు ఆనందం కలిగించాలని భావిస్తోంది. అలాగే లీగ్‌‌ దశలోరైజర్స్‌‌ చేతిలో ఎదురైన పరభవానికి బదులు తీర్చుకోవడంతో పాటు నాకౌట్‌ అవకాశాలు గల్లంతు చేయాలని పట్టుదలగా ఉంది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఏబీ డివిలియర్స్‌‌, పార్థివ్‌ పటేల్‌‌ మినహామిగతా బ్యాట్స్‌‌మెన్‌ ఘోరంగా విఫలమవుతున్నారు. చివరిమ్యాచ్‌ లోనైనా వీరంతా మెరుపులుమెరిపించాలని టీమ్‌ మేనేజ్‌ మెంట్‌ భావిస్తోంది.ఇక బౌలింగ్‌‌ విభాగంలో యజ్వేంద్ర చహల్‌‌పై అధికంగా ఆధారపడుతోంది. నవదీప్‌ సైనీ ఫర్వాలేదనిపిస్తున్నాడు. మహ్మద్‌ సిరాజ్‌ , ఉమేశ్‌యాదవ్‌ లాంటి టీమిండియా బౌలర్లు ధారళంగా పరుగులు సమర్పించుకుంటూన్నారు. బ్యాటింగ్‌‌కు స్వర్గధామమైన ఈ పిచ్‌ పై బౌలింగ్‌‌లోరాణిస్తేనే బెంగళూరుకు ఓదార్పు విజయం సొంతమవుతుంది.

జట్లు (అంచనా)…

సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ : విలియమ్సన్‌ (కెప్టెన్‌ ),సాహా, గప్టిల్‌‌, మనీశ్‌ , విజయ్‌ , అభిషేక్‌ , నబీ,రషీద్‌ , భువనేశ్వర్‌‌, ఖలీల్‌‌, థంపి .

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు: కోహ్లీ (కెప్టెన్‌ ),పార్థివ్‌ , డివిలియర్స్‌‌, స్టొయినీస్‌ , గురుకీరత్‌మాన్‌ , క్లాసెన్‌ , సైనీ, ఖేజ్రోలియా, నేగి, ఉమేశ్‌ ,చాహల్‌‌.

Latest Updates