చల్లబడ్డ సిటీ : ఫైనల్ మ్యాచ్ కి వర్షం అడ్డంకి..?

హైదరాబాద్ : కాసేపట్లో ప్రారంభం కానున్న IPL బిగ్ ఫైట్ కి ప్రేక్షకులు కిక్కిరిసిపోయేలా స్టేడియానికి తరలివస్తున్నారు. చెన్నై వర్సెస్ ముంబై నువ్వానేనా అనేలా తలపడనున్నాయి. రెండు టీమ్స్ బలంగా ఉండటంతో నేటి మ్యాచ్ థ్రిల్లింగ్ జరిగే అవకాశం లేకపోలేదు. అయితే ఫైనల్ పోరుకు వర్షం అడ్డంకిగా మారేటట్లు కనిపిస్తుంది. శనివారం రాత్రి హైదరాబాద్ లో పలుచోట్ల వర్షం రాగా..ఆదివారం సాయంత్రం వాతావరణం చల్లబడింది. దీంతో ఇవాళ కూడా వర్షం పడనుందా అని ప్రేక్షకులు డిస్సాప్పాయింట్ అవుతున్నారు.

వరుణుడు కరుణించి మ్యాచ్ కి అంతరాయం లేకుండా చూస్తాడో లేదా..దంచి కొడుతాడో అనే సందేహం కలుగుతుంది. ముందు జాగ్రత్తగా స్టేడియం గ్రౌండ్ వర్షానికి తడవకుండా రెయిన్ కవర్స్ ఏర్పాట్లు చేశారు సిబ్బంది. ఇప్పటికే ప్రేక్షకులు స్టేడియానికి చేరుకుని ఎంజాయ్ చేస్తున్నారు. ఫైనల్ మ్యాచ్ సందర్భంగా స్పెషల్ ఈవెంట్స్ ఏర్పాటు చేశారు.  రాత్రి 7 గంటలకి మ్యాచ్ ప్రారంభం కానుంది.