ఫైనల్ ఫైట్ : టాస్ గెలిచిన ముంబై

హైదరాబాద్ : IPL సీజన్ -12లో భాగంగా ఉప్పల్ వేదికగా జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. చెన్నైతో జరుగుతున్న బిగ్ ఫైట్ లో టాస్ గెలిచింది ముంబై. కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ సెలక్ట్ చేసుకున్నాడు. ఐపీఎల్ హిస్టరీలో CSK పై ముంబైదే పైచేయి. ఇప్పటి వరకు రెండు జట్లు 29 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో ముంబై 17 మ్యాచుల్లో గెలవగా… చెన్నై 12 మ్యాచుల్లో మాత్రమే గెలిచింది.

ఈ సీజన్లో CSK, ముంబై చెరో 14 మ్యాచులు ఆడాయి. రెండు జట్లు కూడా చెరో 9 మ్యాచుల్లో గెలిచి 18 పాయింట్లు సాధించాయి. పాయింట్లు సమానంగానే ఉన్నా..రన్ రేట్లో మెరుగ్గా ఉన్న ముంబై టేబుల్లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఈ సీజన్లో గత ఐదు మ్యచ్ లు చూస్తే.. CSK 3 మ్యాచుల్లో ఓడగా.. ముంబై 3 మ్యాచుల్లో నెగ్గింది.

రెండు జట్ల కీపర్లు ఫైనల్స్ లో కీలకం కానున్నారు. ముంబై కీపర్ డికాక్, చెన్నై కీపర్ ధోని వీరిద్దరే రెండు జట్ల నుంచి టాప్ స్కోరర్ రేసులో ఉన్నారు. ముంబై కీపర్ డికాక్ 500 పరుగులతో సీజన్ టాప్ స్కోర్లలో ఫిఫ్త్ ప్లేస్ లో ఉన్నాడు. ధోని 414 పరుగులతో 12 వ ప్లేస్ లో ఉన్నాడు. ఇక డికాక్ 4 హాఫ్ సెంచరీలతో అదరగొట్టగా… ధోని 3 అర్ధ సెంచరీలతో జోరు మీదున్నాడు.

టీమ్స్ వివరాలు ఇలా ఉన్నాయి..