
ప్లేయర్ రిటెన్షన్‌కు డెడ్‌లైన్ జనవరి 21
ఫిబ్రవరి 4 వరకూ ట్రేడింగ్ విండో ప్రకటించిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్
ఐపీఎల్ 14వ సీజన్‌కు కసరత్తులు షురూ
న్యూఢిల్లీ: కరోనా టైమ్‌లోనూ ఐపీఎల్‌ను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించిన బీసీసీఐ తర్వాతి సీజన్ కోసం కసరత్తులు మొదలు పెట్టింది. 14వ సీజన్లో ప్లేయర్ రిటెన్షన్‌కు ఈ నెల 21వ తేదీ వరకూ గడువు ఇస్తున్నట్టు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ గురువారం తెలిపింది. ఈ తేదీలోపు ఎనిమిది ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకుంటున్న ప్లేయర్ల లిస్ట్‌ను సబ్మిట్ చేయాలని లీగ్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ పేర్కొన్నారు. అలాగే, ఫ్రాంచైజీల ట్రేడింగ్ విండో (ప్లేయర్లను ఒకరినొకరు బదిలీ చేసుకోవడం) ఫిబ్రవరి 4వ తేదీన ముగుస్తుందని చెప్పారు. వచ్చే సీజన్ ప్లేయర్ల ఆక్షన్ తేదీని ఇంకా నిర్ణయించలేదని తెలిపారు. సమయం తక్కువ ఉన్న నేపథ్యంలో ఈ సీజన్ కోసం మినీ ఆక్షన్‌ను ప్లాన్ చేస్తున్నారు. అది ఫిబ్రవరి సెకండ్ లేదా థర్డ్ వీక్‌లో జరిగే అవకాశం ఉంది. కాగా, 2021 వేలంలో ప్రతీ టీమ్ ప్లేయర్లను కొనుగోలు చేసేందుకు తమకు కేటాయించిన రూ. 85 కోట్లు (ప్లేయర్స్ పర్స్) మాత్రమే ఖర్చు చేయాలని, దాన్ని పెంచే అవకాశం లేదని బ్రిజేష్ స్పష్టం చేశారు. కాగా, గతేడాది వేలం తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ పర్స్‌లో కేవలం రూ. 15 లక్షలే మిగిలున్నాయి. ఈ నేపథ్యంలో గతేడాది భారీ మొత్తం ఖర్చు చేసిన కేదార్ జాదవ్ (రూ. 7.80 కోట్లు), పీయుష్ చావ్లా (రూ. 6.75 కోట్లు) ను రిలీజ్ చేసి తమ పర్స్‌ను పెంచుకునే అవకాశం ఉంది. కాగా, ఐదుసార్లు టైటిల్ విన్నర్ ముంబై ఇండియన్స్ ఖాతాలో రూ. 1.95 కోట్లు ఉన్నాయి. గత సీజన్లో ఆడిన చాలా మంది ప్లేయర్లను ఆ టీమ్ రిటైన్ చేసుకొని కొందర్ని మాత్రమే రిలీజ్ చేయొచ్చు. ఇక, రాజస్తాన్ రాయల్స్ ఖాతాలో అందరికంటే ఎక్కువగా రూ. 14.75 కోట్లు మిగిలున్నాయి. సన్‌రైజర్స్ దగ్గర రూ. 10.10 కోట్లు ఉండగా.. ఢిల్లీ (9 కోట్లు), కోల్‌కతా (8.5 కోట్లు), బెంగళూరు (6.4 కోట్లు) ఖాతాల్లో కూడా పెద్ద మొత్తమే ఉంది. కాగా, ఐపీఎల్ 14వ సీజన్ ఇండియాలోనే జరుగుతుందో లేదో తేల్చేందుకు మరో నెల రోజులు వేచి చూడాలని లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
For More News..