ఆగస్టు 2న ఐపీఎల్ ఫుల్ షెడ్యూల్ !

జనరల్ కౌన్సిల్ మీటింగ్ కు పిలుపు

న్యూఢిల్లీ: ఐపీఎల్ 13వ ఎడిషన్ విషయంలో బీసీసీఐ స్పీడు పెంచింది. కరోనా ముప్పు ఉండడంతో ఈసారి లీగ్ ను యూఏఈలో నిర్వహించేందుకు రెడీ అయిన విషయం తెలిసిందే. ఇందుకు ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రానప్పటి కీ సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు లీగ్ ని ర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ వీకెండ్ లో లీ గ్ కు సంబంధించిన ఫుల్ షెడ్యూల్ రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది ఇందులో భాగంగా ఆగస్టు 2న ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ (జీసీ) మీటింగ్ కు పిలుపునిచ్చింది. ఈ సమావేశం విషయాన్ని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ స్వయంగా వెల్లడించారు.

బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జై షా కూడా ఆదివారం జరిగే ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. స్టే క్ హోల్డర్ల సందేహాలను వీరిద్దరూ క్లియర్ చేస్తా రని భావిస్తున్నారు. ఈ మీటింగ్ అనంతరం ఫ్రాంచైజీలకు ఈ సీజన్ ఐపీఎల్ పై ఫుల్ క్లా రిటీ వస్తుందని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. అంతేకాక ఈసారి లీ గ్ విధివిధానాలకు సంబంధించి తయారు చేసిన స్టాండర్డ్‌​ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌ ఓపీ) ను ఫ్రాంచైజీలకు బోర్డు అందజేయనుంది. దీంతో ప్లే యర్ల ఫ్యామిలీ మెంబర్స్ ను యూఏఈ తీసుకె ళ్లాలా లేదా అనే దానిపై క్లారిటి వస్తుంది. కాగా, ఖాళీ స్టే డియంలో లీగ్ జరగనుండడం వల్ల ఫ్రాంఛైజీలు పెద్ద మొత్తంలో రెవెన్యూ నష్టపోనున్నాయి. ఈ అంశంపై గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ లో చర్చిస్తామని ఓ ఫ్రాంచైజీ అధికారి పేర్కొన్నారు.

Latest Updates