మ్యాచ్ టైం : ఉప్పల్ దగ్గర భారీ ట్రాఫిక్

హైదరాబాద్ : IPL సీజన్-12లో భాగంగా ఆదివారం ఉప్పల్ స్టేడియం వేదికగా ఫైనల్ మ్యాచ్ మరికాసేపట్లో స్టార్ట్ కానుంది. టైటిల్ పోరు కోసం జరుగుతున్న మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో స్టేడియం వద్దకు చేరుకున్నారు. మ్యాచ్ కు గంట ముందే ప్రేక్షకులు లోపలికి వెళ్లనున్నారు. దీంతో ఉప్పల్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. జెండాలు పట్టుకుని ఫ్యాన్స్ సంబరాలు చేస్తూ స్టేడియానికి చేరుకుంటున్నారు. ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పోలీసులు ఏర్పాట్లు చేశారు. వాహనాల పార్కింగ్, ఇన్ గేట్ దగ్గర సెక్యూరిటీని పెంచారు. మ్యాచ్ సందర్భంగా ఇవాళ మిడ్ నైట్ వరకు మెట్రో నడపనున్నట్లు ఇప్పటికే తెలుపారు.

రాత్రి 7 గంటలకు చెన్నై-ముంబై మ్యాచ్ ప్రారంభం కానుంది.