CSK vs KKR: చెన్నై టార్గెట్-173

దుబాయ్‌: ఐపీఎల్ సీజన్-13లో భాగంగా గురువారం దుబాయ్ వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ తో జరుగుతున్న మ్యాచ్ లో కోల్ కతా ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌  నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 రన్స్ చేసింది.  ఓపెనర్‌ నితీశ్‌ రాణా(87: 61 బాల్స్ లో 10ఫోర్లు, 4సిక్సర్లు) అద్భుత హాఫ్ సెంచరీతో రాణించాడు. ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌(26: 17బాల్స్ లో 4ఫోర్లు), ఆఖర్లో దినేశ్‌  కార్తీక్‌(21 నాటౌట్:‌ 10 బాల్స్ లో 3ఫోర్లు)  విజృంభించడంతో కోల్‌ కతా మంచి స్కోర్ చేసింది.  చివర్లో ఇయాన్‌ మోర్గాన్‌(15) దూకుడుగా ఆడలేకపోయాడు.

చెన్నై బౌలర్లలో లుంగి ఎంగిడి రెండు వికెట్లు తీయగా సాంట్నర్‌, జడేజా, కర్ణ్‌ శర్మ చెరో వికెట్‌ తీశారు.

Latest Updates