IPL : ముంబైపై పంజాబ్ విక్టరీ

మొహాలీ : ముంబైతో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ 8 వికెట్ల తేడాతో విక్టరీ సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 7 వికెట్ల నష్టానికి 176 రన్స్ చేసింది. అ తర్వాత టార్గెట్ బరిలోకి దిగిన పంజాబ్ 19 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 177 రన్స్ చేసి గెలుపొందింది. పంజాబ్ ఓపెనర్లు KL రాహుల్(71 :57బాల్స్ లో 6ఫోర్లు, 1సిక్స్  నాటౌట్), గేల్ 40 : 24బాల్స్ లో 3 ఫోర్లు, 4 సిక్సులు  ), అగర్వాల్ (43 : 21బాల్స్ లో4 ఫోర్లు, 2 సిక్సులు) రన్స్ తో రాణించారు.

ముంబై ప్లేయర్లలో..

ముంబై ఇండియన్స్ ఓపెనర్ క్వింటన్ డికాక్(60: 39 బాల్స్ లో 6ఫోర్లు, 2సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించడం, కెప్టెన్ రోహిత్ శర్మ(32: 18బాల్స్ లో 5ఫోర్లు), హార్దిక్ పాండ్య(31: 19 బాల్స్ లో 3ఫోర్లు, సిక్స్) స్కోర్‌ ను పెంచినా ఫ‌లితం లేకుండా పోయింది.

Latest Updates