IPL : కోల్ కతాతో మ్యాచ్..రాజస్థాన్ ఫీల్డింగ్

కోల్ కతా: IPL సీజన్-12లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా గురువారం కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌ తో జరుగుతున్న మ్యాచ్‌ లో రాజస్థాన్ రాయల్స్  టాస్ గెలిచింది. కెప్టెన్ స్టీవెన్ స్మిత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే వరుస పరాజయాలతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. దీంతో ఈ మ్యాచ్‌ లో విజయం సాధించడం రాజస్థాన్‌ కు కీలకంగా మారింది. వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓటమిపాలైన కోల్‌ కతా ఈ మ్యాచ్‌ లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తోంది.

ఈ మ్యాచ్‌ లో కోల్‌కతా రెండు మార్పులు చేసింది. కరియప్ప, గర్నేల స్థానంలో ప్రశిద్ధ్ కృష్ణ, కరోల్స్ బ్రాత్‌ వైట్‌ లను టీమ్ లోకి తీసుకుంది.  రాజస్థాన్ కూడా రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. యాషన్ టర్నర్, ధవల్ కులకర్ణీల స్థానంలో ఓషెన్ థామస్, వరుణ్ అరోణ్‌లను జట్టులోకి తీసుకుంది.

టీమ్స్ వివరాలు ఇలా ఉన్నాయి..

Latest Updates