ఐపీఎల్‌ షెడ్యూల్‌ విడుదల: మ్యాచ్ టైమింగ్స్ లో మార్పులు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 19న అబుధాబీ వేదికగా IPL స్టార్ట్ కానుంది. ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ల మధ్య ఫస్ట్ మ్యాచ్ జరగనుంది. ఇండియన్ టైమ్ ప్రకారం రాత్రి 7గంటల 30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. 20న సెకండ్ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్-కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్ ల మధ్య దుబాయ్ లో జరగనుంది. 21న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది సన్ రైజర్స్ హైదరాబాద్. మ్యాచ్ లు దుబాయ్, అబుధాబి, షార్జాల్లో జరగనున్నాయి. అయితే లీగ్ మ్యాచ్ ల షెడ్యూల్ ను మాత్రమే ప్రకటించింది IPL గవర్నింగ్ కౌన్సిల్. ప్లేఆఫ్స్, ఫైనల్ షెడ్యూల్, వేదికలను తర్వాత ప్రకటిస్తామని తెలిపింది.

ఐపీల్‌ 46 రోజుల పాటు జరుగనుండగా, అబుదాబి, షార్జా, దుబాయి వేదికగా జరుగనున్నాయి. దుబాయిలో 24, అబుదాబిలో 20, షార్జాలో 12 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. మ్యాచ్‌లు మధ్యాహ్నం 3.30గంటల నుంచి రాత్రి 7.30గంటలకు ప్రారంభమవుతాయి. ప్లే ఆఫ్‌, ఫైనల్‌ మ్యాచ్‌ వేదికలో త్వరలో ఖరారు చేయనున్నారు. రాత్రి 7.30గంటలకు 46 మ్యాచ్‌లు జరుగనుండగా, 10 మ్యాచ్‌లు 3.30కి జరుగనున్నాయి.

Latest Updates