ఐపీఎల్ లో పెరిగిన టోర్నీ నిడివి

మార్చి 29 నుంచి ఐపీఎల్‌ ! మే 24న ఫైనల్‌ .. ఆదివారాల్లో మాత్రమే డబుల్​ మ్యాచ్​లు?

న్యూఢిల్లీ: డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ , చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఈ ఏడాది ఐపీఎల్‌ లో తొలి మ్యాచ్‌ ఆడనున్నాయి. మార్చి 29న ముంబై వేదికగా జరిగే ఈ మ్యాచ్‌ తో ఐపీఎల్‌ 13వ ఎడిషన్‌ షురూ కానుంది. ఐపీఎల్‌ షెడ్యూల్‌ ను బీసీసీఐ అధికారికంగా ప్రకటించకపోయినా లీగ్‌ మ్యాచ్‌ లకు సంబంధించి ఫ్రాంచైజీలకు సమాచారం ఇచ్చింది. దీని ప్రకారం మే 17న రాయల్‌ చాలెంజర్స్‌, ముంబై మధ్య జరిగే మ్యాచ్‌ తో లీగ్‌ దశ ముగుస్తుంది. మే 24న మెగా ఫైనల్‌ జరిగే చాన్సుంది.

ఫ్రాంచైజీలకు ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం ఆదివారాల్లో మాత్రమే రెండేసి మ్యాచ్‌ లుంటాయి. దీంతో లాస్ట్‌‌ సీజన్‌ లో 45 రోజులుగా ఉన్న టోర్నీ నిడివి 50 రోజులకు పెరిగింది. బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వస్తే షెడ్యూల్‌ తోపాటు టోర్నీ సన్నాహకంగా అనుకున్న ఆల్‌ స్టార్‌ మ్యాచ్‌ పై క్లారి టీ వస్తుంది.

మరిన్ని వార్తల కోసం

Latest Updates