ఢిల్లీతో మ్యాచ్..చెన్నై బౌలింగ్

ఢిల్లీ : IPL సీజన్-12లో భాగంగా మంగళవారం ఫిరోజ్‌ షా కోట్ల గ్రౌండ్ లో ..చెన్నైతో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచింది ఢిల్లీ. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఫస్ట్ మ్యాచ్ లో RCBతో గెలిచిన చెన్నై మంచి కాన్ఫిడెన్స్ తో ఉండగా..ముంబైపై బిగ్ విక్టరీ సాధించిన జోష్ తో ఉంది ఢిల్లీ. ముంబై బౌలర్ల‌ను ఉతికారేసిన రిషబ్ పంత్ ( 78 నాటౌట్: 27 బంతుల్లో 7×4, 7×6) సూపర్ ఫామ్‌ లో ఉండటంతో చెన్నై కెప్టెన్ ధోనీ తన వ్యూహాలతో.. యువ బ్యాట్స్‌ మ‌న్‌ ను మ్యాచ్‌ లో ఎలా నిలువరిస్తాడో..? అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇవాళ్టి హైఓల్టేజ్‌ మ్యాచ్‌ లో అభిమానులను అలరించేందుకు రెండు టీమ్స్ రెడీగా ఉన్నాయి. దీంతో రెండు టీమ్స్ మధ్యన జరిగే ఇవాళ్టి మ్యాచ్ రసవత్తరంగా జరిగే అవకాశం ఉంది.

టీమ్స్ వివరాలు ఇలా ఉన్నాయి..

Latest Updates