IPL స్పెషల్ : పేరు మార్పుతో ఢిల్లీ క్యాపిటల్స్ రాత మారేనా..!

ఢిల్లీ : IPL ప్రారంభమై 12 సంవత్సరాలైంది. ప్రతిసారి అందరిచూపు ఢిల్లీపైనే. ఈసారైనా ఢిల్లీ టీమ్ కప్పుకొడుతుందా..  రాతమారేనా అనే అనుమానం. అయితే ప్రతీసారి ఓటమిపాలవ్వడం ఢిల్లీ సాంప్రదాయంగా వస్తుంది. అయితే ఈ సారి మాత్రం టీమ్ కు పేరు మార్చారు. ఢిల్లీ డేర్ డెవిల్స్ గా ఉన్న టీమ్ కు ఢిల్లీ క్యాపిటల్స్ అని ఫిక్స్ చేశారు. పేరు మార్చడమే కాకుండా అందుకు తగ్గట్టుగానే టీమ్ లో ఆల్ రౌండర్ ప్లేయర్లను కొనేశారు ప్రాంచైజీలు. శిఖర్ ధావన్, కొలిన్ ఇన్ గ్రామ్, పృద్వీషా, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, మున్రో, రుతుఫొర్డ్, బౌల్ట్, రబడ, అక్షర్ పటేల్, క్రిస్ మొర్రీస్, ఇషాంత్ శర్మ, సందీప్ లమిచనే లాంటి ప్లేయర్లతో బలంగా కనిపిస్తుంది ఢిల్లీ స్క్వాడ్. ఓపెనింగ్ లో ధావన్, పృద్వీషా బాల్ రావడమే ఆలస్యం అనేలా ఆడుతున్నారు. మిడిలార్డర్ విషయానికొస్తే..విధ్వంసక వీరులు కొలిన్ ఇన్ గ్రామ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ ఇరగదీస్తారు. ఢిల్లీ అంటేనే పంత్ అనేలా సత్తా చాటుతున్నాడు. లాస్ట్ ఇయర్ నుంచి పంత్ విరుచుకుపడుతున్నాడు.

ఈ సారి ఫస్ట్ మ్యాచ్ లో ముంబై పై 27 బాల్స్ లోనే 78 రన్స్ చేసి ఔరా అనిపించాడు ఈ యంగ్ క్రికెటర్. బుమ్రా, మెక్లనెగల్, పాండ్యా బ్రదర్స్, బెన్ కటింగ్ లాంటి బౌలర్లతో చెడుగుడు ఆడుకున్నాడు పంత్. ముంబైతో ఢిల్లీ మ్యాచ్ అనగానే.. అందరూ ఢిల్లీని పసికూన అనుకున్నారు. వార్ వన్ సైడ్ ముంబైదే విక్టరీ అనే టాక్ వినిపించింది. కానీ ఢిల్లీ తమదైన ఆటతో అందరి అంచనాలను పటాపంచలు చేసి, పటిష్టమైన ముంబైపై విక్టరీ సాధించి ఫస్ట్ మ్యాచ్ లోనే తమసత్తా చాటింది. మరి ఇవాళ మిస్టర్ కూల్ ధోనీసేనతో తలపడనుంది ఢిల్లీ క్యాపిటల్స్. ఈ మ్యాచ్ లోనూ అదే ఆటను కంటిన్యూ చేస్తామని తెలిపాడు పంత్. ధోనీ ఎక్స్ పీరియన్స్ ముందు ఈ కుర్ర ప్లేయర్లు ఎలా రాణిస్తారా చూడాలి. మరి పేరు మార్పుతో మంచి జోరుమీదున్న ఢిల్లీ ఈ సారైనా కప్పు కొడుతుందా.. సేమ్ సీన్ రిపీట్ చేస్తుందా అని మాట్లాడుకుంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్.

Latest Updates