చెలరేగిన వార్నర్..హైదరాబాద్ భారీ స్కోర్

హైదరాబాద్ : ఉప్పల్ లో పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో హైదరాబాద్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరోసారి సెంచరీతో గర్జించాడు. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన SRHకు మంచి ప్రారంభం దక్కింది. వృద్ధిమాన్ సాహోతో కలిసి వార్నర్ చక్కటి స్కోర్ రాణించాడు. 78 రన్స్ దగ్గర సాహో(28) ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మనీష్ పాండే దూకుడుగా ఆడాడు. వీరిద్దరు ఆచితూచి ఆడుతూ అవసరమైనప్పుడు బౌండరీలు బాదుతూ వచ్చారు. ఈ క్రమంలోనే వార్నర్ హాఫ్ సెంచరీ(81),పూర్తి చేసుకున్నాడు. వార్నర్ కు ఇదే లాస్ట్ మ్యాచ్ కావడంతో చెలరేగి ఆడాడు. హాఫ్ సెంచరీతో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. 20 ఓవర్లో 6 వికెట్లకు 212 రన్స్ చేసి, పంజాబ్ కు చాలెంజింగ్ టార్గెట్ ను ముందుంచింది హైదరాబాద్.

హైదరాబాద్ ప్లేయర్లలో..సాహో(28), మనీష్ పాండే(36), వార్నర్(81), కేన్ విలియమ్సన్(14). నబీ(20), రషీద్ ఖాన్(1), విజయ్ శంకర్(7) అభిషేక శర్మ(5) రన్స్ చేశారు.

పంజాబ్ బౌలర్లలో..అశ్విన్, షమి చెరో రెండు వికెట్లు తీయగా..మురుగన్ అశ్విన్, అర్శ్ దీప్ సింగ్ కు తలో వికెట్ దక్కింది.

Latest Updates