IPL : ఢిల్లీతో మ్యాచ్..హైదరాబాద్ ఫీల్డింగ్

ఢిల్లీ :  IPL సీజన్ -12లో భాగంగా గురువారం ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచింది హైదరాబాద్. కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్ లో సింహాంలా గర్జిస్తున్న వార్నర్ పైనే అందరి దృష్టి ఉంది. ఆడిన ప్రతీ మ్యాచ్ లో విరుచుకుపడుతున్నాడు. లేటెస్ట్ గా బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో వార్నర్, బెయిర్ స్టో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. ఇద్దరు సెంచరీలు చేసి , IPL చరిత్రలో రికార్డు సృష్టించారు. దీంతో ఇవాళ్టి మ్యాచ్ లో హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది SRH. ఢిల్లీని కూడా తక్కువ అంచనా వేయలేము. యంగ్ ప్లేయర్లు చెలరేగి ఆడితే స్కోర్ 200 దాటుతుంది. దీంతో రెండు టీమ్స్ మధ్యన జరిగే ఈ మ్యాచ్ థ్రిల్లింగ్ గా జరిగే అవకాశం ఉంది.

మ్యాచ్ లైవ్ : ఢిల్లీలోని ఫిరోజ్‌ షా కోట్లా మైదానం వేదికగా రాత్రి 8గంటలకు ప్రారంభం కానుంది.

టీమ్స్ వివరాలు ఇలా ఉన్నాయి..

Latest Updates