IPL : వార్నర్ లేని లోటును గుప్తిల్ తీర్చేనా..?

ముంబై : IPL సీజన్-12లో భాగంగా గురువారం ముంబైతో..హైదరాబాద్ తలపడనుంది. ఇన్ని రోజులు SRH బలం డేవిడ్ వార్నర్ అనేలా ఆడి, అందరినీ ఆకట్టుకున్నాడు వార్నర్. అయితే వరల్డ్ కప్ సందర్భంగా SRHకు దూరమైన వార్నర్ ప్లేస్ లో న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ మార్టిన్ గుప్టిల్ ఇవాళ్టి మ్యాచ్ లో టీమ్ లోకి రానున్నాడు. న్యూజిలాండ్ లో ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ అయిన గుప్టిల్ ను తక్కువ అంచనా వేయలేమంటున్నారు SRH ప్లేయర్లు. బౌలింగ్ తో అదరగొడుతున్న హైదరాబాద్..వార్నర్ దూరమైతే ఎలా అనే సమయంలో ..గుప్టిల్ రాకతో బలంగానే కనిపిస్తుంది హైదరాబాద్ టీమ్.

ఫామ్ లోకి వస్తే..తిరుగుండదు..

మార్టిన్ గుప్టిల్ ను తక్కువ అంచనా వేయలేమని కాన్ఫిడెన్స్ గా ఉన్నామని చెబుతుంది SRH టీమ్. అతడు బౌండరీలు, సిక్సర్లు ఈజీగా కొడుతాడని..3,4 ఓవర్లు సరిగ్గా క్రీజులో ఉంటేచాలు పరుగుల వరద రావడం ఖాయం అంటున్నారు. వెల్ కమ్ మార్టిన్ గుప్టిల్.

మిగతా ప్లేయర్లు ..

వృద్ధిమాన్ సాహా, మనీష్ పాండే, యూసుఫ్ పఠాన్ రాణిస్తే మరోసారి హైదరాబాద్ కప్పు కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెబుతున్నారు క్రికెట్ అనలిస్టులు.

బౌలింగ్..కిక్కు..

భువనేశ్వర్, రషీద్ ఖాన్, నబీ..ఈ ముగ్గురు బౌలర్లు అదరగొడుతున్నారు. బౌలింగ్ తో పాటు కట్టుదిట్టమైన ఫీల్డింగ్, బ్యాటింగ్ చేస్తే మనోళ్లు మరోసారి విజేతగా నిలిచే అవకాశం డెఫినెట్ గా ఉంది.

 

 

Latest Updates