ఐపీఎల్.. అరుదైన టోర్నీ గా వరల్డ్ రికార్డు

న్యూఢిల్లీ: వరల్డ్‌‌‌‌ క్రికెట్‌ ను అలరిస్తున్న ఐపీఎల్‌‌‌‌కు అరుదైన ఘనత దక్కింది. ప్రపంచంలోనే ‘బెస్ట్‌‌‌‌ లీగ్‌‌‌‌’అని ఓ స్టడీలో తేలింది. వరల్డ్‌‌‌‌ వైడ్‌ గా జరుగుతున్న టీ20 ఫ్రాంచైజీ క్రికెట్‌ ఈవెంట్లన్నింటిలోనూ హయ్యెస్ట్‌‌‌‌ స్టాండర్డ్‌‌‌‌ ఐపీఎల్‌‌‌‌దేనని క్రికెట్‌ అనలిటిక్స్‌‌‌‌పై వర్క్‌‌‌‌ చేసే ‘క్రిక్‌ విజ్‌’సంస్థ వెల్లడించింది. మెగా లీగ్‌‌‌‌లో ఆడే క్రికెట్‌ క్వాలిటీ.. ఇంటర్నేషనల్‌‌‌‌ టీ20 క్రికెట్‌ మ్యాచ్‌ ల యావరేజ్‌ కంటే అధికమని తెలిపింది. ఇందుకోసం వరల్డ్‌‌‌‌ వైడ్‌ గా వివిధ లీగ్స్‌‌‌‌లో ఆడుతున్న 4500 మంది క్రికెటర్ల డేటాను అధ్యయనం చేసింది. ప్లేయర్లు ఆడిన వాతావరణ పరిస్థితులు, వేదికలు, మ్యాచ్‌ సిచ్యువేషన్స్‌‌‌‌ను బేస్‌ చేసుకొని.. సదరు లీగ్‌‌‌‌, మ్యాచ్‌, ప్లేయర్‌ సామర్థ్యాన్ని లెక్కగట్టింది. వివిధ లీగ్స్‌‌‌‌లో పోటీ పడ్డ ప్లేయర్ల పెర్ఫామెన్స్‌‌‌‌.. లీగ్‌‌‌‌ టు లీగ్‌‌‌‌ ఎలా మారిందో పరిశీలించి బెస్ట్‌‌‌‌ లీగ్‌‌‌‌ను గుర్తించింది. ఉదాహరణకు బిగ్‌‌‌‌ బాష్‌ లీగ్‌‌‌‌లో బాగా ఆడిన ఓ బ్యాట్స్‌‌‌‌మె న్‌ ఐపీఎల్‌‌‌‌లో స్ట్రగుల్‌‌‌‌ అయ్యాడు. అంటే బీబీఎల్‌‌‌‌తో పోల్చితే ఐపీఎల్‌‌‌‌లో ఆడే క్రికెట్‌ క్వాలిటీ ఎక్కువ అని, ఇక్కడ పోటీ కూడా ఎక్కువగా ఉందని తేల్చింది. అదే విధంగా బంగ్లాదేశ్‌ ప్రీమియర్​ లీగ్‌‌‌‌ (బీపీఎల్‌‌‌‌)లో నిలకడగా ఆడిన ప్లేయర్​.. కరీబియన్‌ ప్రీమియర్​లీగ్‌‌‌‌(సీపీఎల్‌‌‌‌)లో తడబడితే సీపీఎల్‌‌‌‌ స్టాండర్డ్‌‌‌‌ ఎక్కువ అన్నమాట.

లీగ్ సగటు ఎక్కువ..

ఒక యావరేజ్‌ టీ20 ఇంటర్నేషనల్‌‌‌‌ మ్యాచ్‌ లో ఆడిన క్రికెటర్‌ ను ఐపీఎల్‌‌‌‌లో ఆడిస్తే అతను ఒక బాల్‌‌‌‌కు 0.04 రన్స్‌‌‌‌ మాత్రమే స్కో రు చేస్తాడని తేలింది. అంటే ఇది అతని ఇంటర్నేషనల్‌‌‌‌ సగటు కంటే చాలా తక్కువ. టీ20 ఇంటర్నేషనల్‌‌‌‌ మ్యాచ్‌ తో పోలిస్తే ఐపీఎల్‌‌‌‌, ఎంజన్సీ సూపర్‌ లీగ్‌‌‌‌ (ఎంఎస్‌ ఎల్‌‌‌‌), సీపీఎల్‌‌‌‌, పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌‌‌‌ (పీఎస్‌ ఎల్‌‌‌‌), బీబీఎల్‌‌‌‌లోనే హయ్యెస్ట్‌‌‌‌ క్వాలిటీ ఉంది. అదే టైమ్‌ లో ఇంగ్లండ్‌ లో జరిగే టీ20 బ్లాస్ట్‌‌‌‌, బీపీఎల్‌‌‌‌, న్యూజిలాండ్‌ లో జరిగే సూపర్​ స్మాష్‌ లీగ్స్‌‌‌‌లో యావరేజ్‌ టీ20 ఇంటర్నేషనల్‌‌‌‌ కంటే తక్కువ క్వాలిటీ ఉంది. సాధారణ ఇంటర్నేషనల్‌‌‌‌ మ్యాచ్‌ ఆడే ప్లేయర్​ను సూపర్ స్మాష్‌ లో ఆడిస్తే అతను బాల్‌‌‌‌కు 0.06 రన్స్‌‌‌‌ చేస్తాడని అది అతని టీ20 ఇంటర్నేషనల్‌‌‌‌ సగటు కంటే ఎక్కువ అని క్రిక్‌ విజ్‌ పేర్కొన్నది. క్రికెట్‌ స్టాండర్డ్‌‌‌‌ విషయంలో ఐపీఎల్‌‌‌‌ తర్వాత ఎంజన్సీ సూపర్​ లీగ్‌‌‌‌ (సౌతాఫ్రికా) ఉంది. అయితే ఈ లీగ్‌‌‌‌ ఒకే సీజన్‌ డేటాతో పాటు స్మాల్‌‌‌‌ సైజ్‌ శాంపిల్స్‌‌‌‌ను తీసుకోవడం వల్లే ఎక్కువ ర్యాంక్‌ వచ్చిందని క్రిక్‌ విజ్‌ వెల్లడించింది.

ఇంటర్నేషనల్‌ లో క్వాలిటీ లేదు

టీ20 ఫార్మాట్‌ కు ఇంటర్నేషనల్‌‌‌‌ క్రికెట్‌ బెంచ్‌ మార్క్‌‌‌‌ కానే కాదని వెల్లడైంది. క్వాలిటీ విషయంలో ఓ టీ20 ఇంటర్నేషనల్‌‌‌‌ సగటు వరల్డ్‌‌‌‌ వైడ్‌ ఐదు డొమెస్టిక్స్‌‌‌‌ లీగ్స్‌‌‌‌ సగటు కంటే తక్కువ ఉన్నట్టు తేలిం ది. అయితే ఇంటర్నేషనల్‌‌‌‌ టీ20ల్లో ఆయా జట్లకు ఒక్క దేశానికి చెందిన ప్లేయర్లుఆడతారని, అదే లీగ్స్‌‌‌‌లో అన్ని దేశాల క్రికెటర్లు ఉంటారు కాబట్టే వాటి స్టాండర్డ్‌‌‌‌ పెరిగిందని క్రిక్‌ విజ్‌ వివరించింది. అలాగే కొన్ని దేశాలకు చెందిన ప్లేయర్లు తమ నేషనల్‌‌‌‌ టీమ్‌ కంటే టీ20 లీగ్స్‌‌‌‌కే మొగ్గు చూపడం కూడా ఇంటర్నేషనల్‌‌‌‌ 20 క్రికెట్‌ క్వాలిటీ పడిపోవడానికి కారణమవుతోందని చెప్పింది.

Latest Updates