ఐపీఎల్ సూపర్ హిట్ అవుతుంది: పంజాబ్ కింగ్స్ వాడియా జోస్యం

న్యూఢిల్లీ: ఐపీఎల్ స్టార్ట్ అయితే.. సూపర్ హిట్ కావడం ఖాయం.. వేచి చూడండి అంటూ జోస్యం చెప్పారు పంజాబ్ కింగ్స్ ఎలవెన్ పంజాబ్ కో ఓనర్ నెస్ వాడియా. అయితే ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు వచ్చినా.. ఐపీఎల్‌‌ మొత్తం ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. అందుకే టోర్నీ సందర్భంగా అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాడు. అత్యంత సురక్షితమైన చర్యల మధ్య లీగ్‌ ను సేఫ్‌ గా నిర్వహించాలని బీసీసీఐని కోరాడు. ‘ఐపీఎల్‌‌పై అనేక ఊహాగానాలు వస్తున్నాయి. అవన్నీ అర్థరహితం. ఈ ఏడాది ఐపీఎల్‌‌ జరిగి తీరుతుంది. ఇందుకు ఫ్రాంచైజీ ఓనర్లు సంతోషపడాలి. టైటిల్‌‌ స్పాన్సర్‌‌షిప్‌‌, ఇతర గొడవలు మనకు అవసరం లేదు. మనం దృష్టిపెట్టాల్సిన అంశాలు వేరే ఉన్నాయి. ప్లేయర్లు, సిబ్బందిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ విషయంలోనే మేం ఆందోళనలో ఉన్నాం. ఎందుకంటే ఒక్క పాజిటివ్‌ వచ్చినా లీగ్‌ మొత్తం గందరగోళంలో పడుతుంది’ అని వాడియా పేర్కొన్నాడు. ఐపీఎల్‌‌ సూపర్ హిట్‌ అవుతుందని జోస్యం చెప్పిన వాడి యా.టీవీల్లో అత్యధికంగా వీక్షించిన టోర్నీగా రికార్డులు సృష్టిస్తుందన్నాడు.

Latest Updates